తెలంగాణ

telangana

ETV Bharat / bharat

20 ఏళ్ల గరిష్ఠ వినియోగంలో లోక్​సభ సమావేశాలు - లోక్​సభ సమావేశాలు

ప్రస్తుత లోక్​సభ సమావేశాలు అర్థవంతంగా జరుగుతున్నాయి. గత ఇరవై ఏళ్లలో 128 శాతం ఉపయోగకరమైన చర్చలు జరిగిన సమావేశాలుగా రికార్డు సృష్టించాయి.

20 ఏళ్ల గరిష్ఠ వినియోగంలో లోక్​సభ సమావేశాలు

By

Published : Jul 19, 2019, 6:48 AM IST

17వ లోక్​సభ తొలి సమావేశాలు అర్థవంతంగా జరుగుతున్నాయి. జూన్ 17న ప్రారంభమై, ఈ నెల 26 వరకూ సమావేశాలు కొనసాగనున్నాయి. గత ఇరవై ఏళ్లలో 128 శాతం ఉపయోగకరంగా జరుగుతున్న సమావేశాలుగా ఈ దఫా మీటింగ్స్ చరిత్ర సృష్టించాయని పీఆర్​ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అనే పరిశోధనా సంస్థ ప్రకటించింది.

బడ్జెట్​పై 17 గంటలపాటు చర్చ జరగగా, రైల్వే కేటాయింపులపైన 13, రహదారులు భవనాలపైనా 7.44 గంటల పాటు లోక్​సభలో చర్చించారు.

గ్రామీణాభివృద్ధి, వ్యవసాయానికి కేటాయింపులపై 10.36 గంటల పాటు చర్చ జరిగింది. క్రీడలు, యువజన వ్యవహారాలపై 4.14 గంటల పాటు లోక్​సభ సమావేశమైంది.

గత కొద్దిరోజులుగా శూన్య గంటను నిర్వహించలేదు. గురువారం నాటి శూన్యకాలంలో ప్రజలకు అత్యవసరమైన అంశాలను లేవనెత్తాలని సభ్యులకు సూచించారు స్పీకర్ ఓం బిర్లా.

గురువారం శూన్యకాలం గడువును పొడిగించిన సమయంలో 162 మంది సభ్యులు వివిధ ప్రజోపయోగకరమైన అంశాలను లేవనెత్తారు. ఈ కారణంగా రాత్రి 10.50 గంటల వరకు సభలో చర్చ జరిగింది.

ఈ దఫా సమావేశాలు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కంటే ఎక్కువ సమయం జరుగుతున్నాయి. లోక్​సభ చర్చ 128 శాతం ఉత్పాదకత సాధించిందని పీఆర్​ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. రాజ్యసభా ఇదే కోవలో ఎక్కువకాలం కార్యకలాపాలను నిర్వహించింది.రాజ్యసభ ఉత్పాదకత 98శాతంగా నమోదైంది.

ఇదీ చూడండి: ఆ పార్టీల జాతీయ హోదా.... గల్లంతేనా?

ABOUT THE AUTHOR

...view details