తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండు వ్యవసాయ బిల్లులకు లోక్​సభ ఆమోదం - వ్యవసాయ రంగంలో సంస్కరణలు

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. రైతుల ఉత్పత్తి, వాణిజ్యం (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు-2020, ధరల భరోసా, వ్యవసాయ సేవల బిల్లు-2020కు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది దిగువసభ. విపక్షాలు వ్యతిరేకించినప్పటికీ అధికార పక్షం వెనక్కి తగ్గలేదు. బిల్లుల ఆమోదాన్ని నిరసిస్తూ.. కాంగ్రెస్​, డీఎంకే, ఆర్​ఎస్​పీ సభ్యులు సభ​ నుంచి వాకౌట్​ చేశారు.

Lok Sabha passes two agri sector bills amid protests by Opposition, SAD
ఆ రెండు వ్యవసాయ బిల్లులకు లోక్​సభ ఆమోదం

By

Published : Sep 17, 2020, 10:33 PM IST

Updated : Sep 18, 2020, 10:27 AM IST

వ్యవసాయరంగంలో సంస్కరణలు తెచ్చే రెండు బిల్లులు లోక్​సభలో ఆమోదం పొందాయి. ప్రతిపక్ష పార్టీలు సహా భాజపాతో కూటమిలోని సభ్యులు వ్యతిరేకించినప్పుటికీ మోదీ సర్కార్​ వెనక్కి తగ్గలేదు. మూజువాణి ఓటుతో బిల్లులకు ఆమోదం తెలిపింది దిగువసభ.

కేంద్రం తీసుకొచ్చిన బిల్లులు ఇవే..

  1. రైతులు తమ ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లోనే విక్రయించాలన్న నిబంధనను తొలగిస్తూ తీసుకొచ్చిన... 'ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ (ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌) బిల్లు'
  2. పంట వేయడానికి ముందే వ్యవసాయ ఉత్పత్తుల విక్రయంపై వ్యాపారులతో రైతులు చేసుకొనే ఒప్పందాలకు రక్షణ కల్పించే... ' ఫార్మర్స్‌ (ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అగ్రిమెంట్‌ ఆన్‌ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్‌ ఫామ్‌ సర్వీసెస్‌ బిల్లు'

ఈ బిల్లులను ఆమోదం కోసం రాజ్యసభకు పంపనున్నారు. అయితే, రాజ్యసభలో ఏయే బిల్లులను చర్చించాలి.. వేటిని సెలెక్ట్‌ కమిటీకి పంపాలనే అంశంపై ఇటీవల కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విపక్షాలతో చర్చలు జరిపారు.

కేంద్రమంత్రి రాజీనామా...

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ సంబంధ బిల్లులను.. నిరసిస్తూ కేంద్రమంత్రి పదవికి శిరోమణి అకాలీదళ్‌ సభ్యురాలు హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ రాజీనామా చేశారు. తన రాజీనామాను ప్రధాని మోదీ కార్యాలయంలో సమర్పించారు. హర్​సిమ్రత్​ ఎన్డీయే కూటమిలోని శిరోమణి అకాలీదళ్‌ వ్యక్తి కావడమే కాకుండా ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో కేంద్ర ఆహార శుద్ధి శాఖ మంత్రిగానూ పనిచేస్తున్నారు.

రైతులు, వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులకు సంబంధించిన కీలక బిల్లులను కేంద్రం తీసుకురాగా.. వీటిలో అనేక అంశాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని.. వ్యవసాయ రంగం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి మరింత ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని అకాలీదళ్‌ అభిప్రాయపడింది. ఈ బిల్లులు చట్టరూపం దాలిస్తే వ్యవసాయరంగం సంక్షోభంలోకి వెళ్తుందని పేర్కొంటూ కేంద్రంతో అకాలీదళ్‌ విబేధించింది. ఈ రకమైన అభిప్రాయాన్ని ఇప్పటివరకు ఎక్కడా వ్యక్తంచేయని అకాలీదళ్‌.. లోక్‌సభలో చర్చ సందర్భంగా లేవనెత్తడం ప్రభుత్వాన్ని కొంత ఇబ్బందికి గురిచేసినట్టయింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న రైతు వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగానే తానీ నిర్ణయం తీసుకున్నట్టు హర్​సిమ్రత్​ తెలిపారు. శిరోమణి అకాలీదళ్ పార్టీ..‌ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినప్పటికీ ఎన్డీయేలో కొనసాగనున్నట్టు సమాచారం.

లేఖలు చించివేత..

రైతు బిల్లులపై పంజాబ్ కాంగ్రెస్ ఎంపీలు గురువారం తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా ప్రభుత్వ ప్రతిపాదిత బిల్లుల కాపీలను పార్లమెంటు ఆవరణలో తగులబెట్టారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. బిల్లును ఆప్​ ప్రభుత్వం కూడా వ్యతిరేకించింది. బిల్లుల ఆమోదాన్ని నిరసిస్తూ.. కాంగ్రెస్​, డీఎంకే, ఆర్​ఎస్​పీ సభ్యులు హౌస్​ నుంచి వాకౌట్​ చేశారు.

Last Updated : Sep 18, 2020, 10:27 AM IST

ABOUT THE AUTHOR

...view details