మానవ హక్కుల చట్టం సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ఉన్న చట్టంలోని కీలక అంశాలను సవరిస్తూ తీసుకొచ్చిన బిల్లుకు విపక్షాలు అభ్యంతరం తెలిపినా సభ అంగీకారం తెలిపింది. ఈ చట్టం మానవ హక్కులను మరింత సమర్థంగా కాపాడుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ స్పష్టం చేశారు.
బిల్లులోని అంశాలు..
- మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ పదవీ కాలాన్ని 5 ఏళ్ల నుంచి మూడేళ్లకు కుదింపు
- కమిషన్ ఛైర్మన్గా భారత విశ్రాంత ప్రధాన న్యాయమూర్తితో పాటు సుప్రీం విశ్రాంత న్యాయమూర్తులనూ నియమించవచ్చు.
- రాష్ట్రాల కమిషన్లోనూ హైకోర్టు న్యాయమూర్తులను నియమించవచ్చు.
- కమిషన్లో సభ్యుల సంఖ్య పెంపు
ఇప్పుడున్న ఎస్సీ, ఎస్టీ, మహిళా జాతీయ కమిషన్ సభ్యులతో పాటుగా బీసీ, బాలల హక్కుల సంరక్షణ జాతీయ కమిషన్లు, దివ్యాంగుల శాఖ చీఫ్ కమిషనర్ కమిషన్లో భాగస్వాములుగా ఉంటారు.
- పాలన పరమైన అధికారాలతో పాటు ఆర్థికంగా మరింత బలోపేతం