భారతదేశం.. 28రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల సమాహారం. అయితే కేంద్రపాలనలో ఉన్న 9 ప్రాంతాల సంఖ్య ఇక మీదట 8కి చేరనుంది. దమణ్ దీవ్, దాద్రానగర్ హవేలీలను ఒకే ప్రాంతంగా మారుస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుకు బుధవారం లోక్సభ ఆమోదం తెలిపింది. రాజ్యసభలోనూ ఆమోదం పొందితే.. అధికారికంగా కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎనిమిదికి చేరనుంది.
"మెరుగైన పాలనా సేవలను అందించడం కోసం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను విలీనం చేస్తున్నాం. ఈ నిర్ణయం ద్వారా కేంద్రపాలనలోని ప్రాంతాలకు సరైన రీతిలో అభివృద్ధి జరుగుతుంది. అంతేకాకుండా పాలనా ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. పరిపాలనను మరింత సులభతరం చేసేందుకు మోదీ ప్రభుత్వం చేపట్టిన విధానం ద్వారా ప్రజలకు మేలు చేకూరుతుంది."