తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్​ బరి: కాంగ్రెస్​, ఎల్​జేపీల మేనిఫెస్టోలు విడుదల - లోక్​ జనశక్తి పార్టీ మేనిఫెస్టో

బిహార్​ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశాయి కాంగ్రెస్​, లోక్​ జనశక్తి పార్టీలు. బిహార్​ ఫస్ట్​ అనే తమ విజన్​ను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఎన్నికల ప్రణాళికను విడుదల చేశామన్నారు ఎల్​జేపీ అగ్రనేత చిరాగ్​ పాసవాన్​. ప్రస్తుత సీఎం నితీశ్​ మళ్లీ గెలిస్తే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని ఆరోపించారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను అడ్డుకుంటామని తమ మేనిఫెస్టోలో పేర్కొంది కాంగ్రెస్​.

Chirag Paswan releases party's manifesto
బిహార్​ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన ఎల్​జేపీ కాంగ్రెస్​

By

Published : Oct 21, 2020, 12:47 PM IST

Updated : Oct 21, 2020, 5:43 PM IST

బిహార్​ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో గెలుపే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి పార్టీలు. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకర్షించేందుకు పలు హామీలతో కూడిన మేనిఫెస్టోను బుధవారం విడుదల చేశాయి కాంగ్రెస్​, లోక్​జనశక్తి పార్టీ (ఎల్​జేపీ).

పట్నాలో జరిగిన కార్యక్రమంలో ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు ఎల్​జేపీ అగ్రనేత చిరాగ్​ పాసవాన్​. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​పై విమర్శలు గుప్పించారు.

" బిహార్​ ఫస్ట్​ అనే మా విజన్​ను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశాం. దాని ద్వారా బిహార్​ ప్రజలు ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మతతత్వాన్ని ప్రోత్సహించే వ్యక్తి నాయకత్వంలో బిహార్​ అభివృద్ధిని ఊహించలేం. ఒకవేళ ఏదైనా జరిగి ప్రస్తుత ముఖ్యమంత్రి గెలిస్తే మన రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. మళ్లీ వినాశనపు అంచులకు చేరుతుంది."

- చిరాగ్​ పాసవాన్​, ఎల్​జేపీ అగ్రనేత

అమ్మ ఆశీర్వాదం

మేనిఫెస్టో విడుదల కోసం పార్టీ కార్యాలయానికి వెళ్లే ముందు తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు చిరాగ్​ పాసవాన్​. మేనిఫెస్టో పుస్తకాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అఖండ విజయం సాధించాలని సింధూర తిలకం దిద్ది ఆశీర్వదించారు పాసవాన్​ తల్లి.

కాంగ్రెస్​ మేనిఫెస్టో..

బిహార్​ ఎన్నికల కోసం 'బద్లావ్​ పత్ర-2020' పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది కాంగ్రెస్​. ఇందులో పార్టీ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సింగ్​ సుర్జేవాలా, రాజ్​బబ్బర్​ సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. 'మా ప్రత్యర్థులు రుణాలు, విద్యుత్తు బిల్లుల మాఫీ, సాగు సౌకర్యాల పెంపు వంటి వాటిపై మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. పంజాబ్​లో చేసిన మాదిరిగా ప్రత్యేక వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చి ఎన్​డీఏ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ సంస్కరణ చట్టాలను అడ్డుకుంటాం' అని పేర్కొన్నారు కాంగ్రెస్​ నేత శక్తిసిన్హ్ గోహిల్​.

మేనిఫెస్టోలోని కీలక అంశాలు..

  • 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన
  • వ్యవసాయ రుణాల మాఫీ
  • నెలకు రూ.1500 నిరుద్యోగ భృతి
  • వ్యవసాయ విద్యుత్తు బిల్లుల్లో 50 శాతం రాయితీ
  • నూతన వ్యవసాయ చట్టాలను అడ్డుకునేలా బిల్లులు తీసుకురావటం

ఇదీ చూడండి: ఎన్నికల ప్రచార సభలో ప్రతిపక్ష నేతపైకి చెప్పులు

Last Updated : Oct 21, 2020, 5:43 PM IST

ABOUT THE AUTHOR

...view details