తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాడులో మళ్లీ లాక్​డౌన్​- జూన్​ 19 నుంచి అమలు

By

Published : Jun 15, 2020, 3:36 PM IST

Updated : Jun 15, 2020, 5:06 PM IST

LOCKDOWN IN 4 DISTRICTS TAMILNADU
తమిళనాడులో మళ్లీ లాక్​డౌన్​

16:30 June 15

కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది తమిళనాడు ప్రభుత్వం. మరోసారి లాక్​డౌన్​ విధించనున్నట్లు ప్రకటించింది. అయితే రాష్ట్రం మొత్తం కాకుండా వైరస్​ ప్రభావం అధికంగా చెన్నై, దాని చుట్టుపక్కల ప్రాంతాల వరకే లాక్​డౌన్​ను పరిమితం చేయనున్నట్లు వెల్లడించింది. జూన్​ 19 నుంచి 30వరకు 12 రోజుల పాటు లాక్​డౌన్​ను అమలు చేయనున్నట్లు తెలిపింది.

తమిళనాడులో కరోనా కేసులు  విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో నిపుణుల ప్యానెల్​తో సమావేశం నిర్వహించిన అనంతరం ఈ విషయాన్ని తెలిపారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కే పళనిస్వామి. చెన్నై, తిరవళ్లూర్​, చెంగల్​పేట్, కాంచీపురం జిల్లాల్లో 12 రోజులు లాక్​డౌన్​ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆ ప్రాంతాల్లో నిత్యవసర సేవలకు ఆంక్షలతో కూడిన అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. జూన్ 21, 28 రెండు ఆదివారాల్లో ఎలాంటి సడలింపులు లేకుండా పూర్తిస్థాయి లాక్​డౌన్ అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

లాక్​డౌన్​ ఆదేశాలు

  • దుకాణాలు మూసివేయాలి.
  • కూరగాయలు, పండ్లు, నిత్యావసర వస్తువుల విక్రయాలకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకే అనుమతి.
  • అత్యవసరం అయితేనే ఆటోలు, ట్యాక్సీలకు అనుమతి.
  • హోటళ్లు, రెస్టారెంట్లకు ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు అనుమతి.  పార్సిల్ సుదుపాయం మాత్రమే అందుబాటులో ఉంటుంది.
  • ఫుడ్​ డెలివరీ సంస్థలకు అనుమతి.
  • చెన్నై దాటి వెళ్లాలంటే ఈ-పాస్ తప్పనిసరి. వివాహ వేడుకలు, అంత్యక్రియలు, ఆరోగ్య అత్యవసర పరిస్థితికి సంబంధించి సరైన పత్రాలు ఉంటేనే అనుమతి.
  • రైలు, విమాన సేవలు యాథావిధిగా కొనసాగుతాయి.
  • జూన్​ 21, 28 ఈ రెండు ఆదివారాల్లో ఎలాంటి సడలింపులు లేకుండా పూర్తిస్థాయి లాక్​డౌన్​ అమల్లో ఉంటుంది. నిత్యావసర, అత్యవసర సేవలకే అనుమతి.
  • కంటైన్​మెంట్​​ జోన్లలో లేని 33 శాతం మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరుకావాలి.
  • కంటైన్​మెంట్ జోన్లకు ఎలాంటి సడలింపులు లేవు.
  • లాక్​డౌన్​లో టీ షాపులు తెరిచేందుకు అనుమతి లేదు.
  • అమ్మ క్యాంటీన్లు తెరిచే ఉంటాయి.
  • నిర్మాణ పనులు కొనసాగించవచ్చు. పని ప్రదేశంలోనే కార్మికులకు ఆశ్రయం కల్పించాలి. వారికి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలి.
  • బ్యాంకులు, కోర్టులు, మీడియా సంస్థలు కార్యకలాపాలు కొనసాగించవచ్చు.

15:33 June 15

తమిళనాడులో మళ్లీ లాక్​డౌన్​- జూన్​ 19 నుంచి అమలు

కరోనా కేసులు పెరుగుతున్నందున తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాలో జూన్​ 19 నుంచి 30 వరకు పూర్తి స్థాయి లాక్​డౌన్​ అమలు చేయనుంది.

Last Updated : Jun 15, 2020, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details