తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లాక్​డౌన్​ 5.0: పర్యటకం, ఆతిథ్య రంగాలకు ఊరట! - hospitality industry in India

ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా లాక్​డౌన్​ 5.0లో పర్యటకం, ఆతిథ్య రంగానికి సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ రంగాల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతించాలని డిమాండ్​ చేస్తున్న నేపథ్యంలో ఆ దిశగా విస్తృత చర్చలు జరపుతోంది కేంద్రం.

Lockdown 5
లాక్​డౌన్​ 5.0లో పర్యటకం, ఆతిథ్య రంగానికి అనుమతి!

By

Published : May 30, 2020, 2:29 PM IST

కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు లాక్​డౌన్​ను మరిన్ని రోజులు పొడిగించనుంది కేంద్రం. ఆర్థిక వ్యవస్థపై ఉన్న ఒత్తిడిని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా లాక్​డౌన్​ 5.0లో పర్యటకం, ఆతిథ్య రంగానికి సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది. ఆయా రంగాలపై ఎక్కువగా ఆధారపడే రాష్ట్రాలు వాటికి అనుమతించాలని కోరుతున్న నేపథ్యంలో ఆ దిశగా చర్చలు జరుపుతోంది.

పుదుచ్చెరి, కేరళ, గోవా సహా పలు ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు పర్యటకం, ఆతిథ్య రంగంపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. అందుకే లాక్​డౌన్​ 5.0లో వివిధ రాష్ట్రాలు కోరుతున్నట్లుగా హోటళ్లు, రెస్టారెంట్లు, బీచ్​లను ప్రారంభించే దారులు అన్వేషిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

" పర్యటకం, ఆతిథ్య రంగంపై ఆధారపడే రాష్ట్రాలు ఇప్పటికీ ఇబ్బందుల్లోనే ఉన్నాయి. ఆయా రంగాల్లో నిబంధనలను సడలించాలని డిమాండ్​ చేస్తున్నాయి. లాక్​డౌన్​ 5.0లో పర్యటకం, ఆతిథ్య పరిశ్రమకు సడలింపులు ఇవ్వొచ్చని భావిస్తున్నాం. భౌతిక దూరం పాటించటం, పర్యటకులను పరిమితంగా అనుమతించటం ద్వారా హోటళ్లు, రెస్టారెంట్లు, పర్యటక ప్రాంతాలను ప్రారంభించేందుకు రాష్ట్రాలు పలు సూచనలు చేశాయి. పరిమిత సంఖ్యలో సిట్టింగ్​ సామర్థ్యం, థర్మల్​ స్క్రీనింగ్​, ఆరోగ్య సేతు యాప్​ తప్పనిసరి చేయటం వంటి వాటితో కార్యకలాపాలకు అనుమతిస్తామని రాష్ట్రాలు చెప్పాయి. వాటిని ప్రారంభించటం ద్వారా రాష్ట్రాలకు అవసరమైన ఆదాయలను సమకూర్చుకోవచ్చని కేంద్రానికి వివరించాయి. ఆర్థిక రంగాన్ని ముందుకు తీసుకెళ్లేలా నిబంధనలను సులభతరం చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. ఈ విషయంపై కేంద్రం విస్తృత చర్చలు జరుపుతోంది. కానీ.. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు."

– సీనియర్​ అధికారి

మరోవైపు.. హోంశాఖ మంత్రి అమిత్​ షాతో తాను మాట్లాడినట్లు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్​ సావంత్​ తెలిపారు. మరో 15 రోజుల పాటు లాక్​డౌన్​ పొడిగించే అవకాశం ఉన్నట్లు చెప్పారు. 50 శాతం సామర్థ్యంతో భౌతిక దూరం పాటిస్తూ సేవలందించేలా రెస్టారెంట్లకు సడలింపులు ఇవ్వాలని గోవా ప్రభుత్వం డిమాండ్​ చేస్తోందన్నారు. ఇప్పటికే చాలా మంది జిమ్​లను తెరవాలని కోరకుంటున్నట్లు వెల్లడించారు.

కర్ణాటక ప్రభుత్వం హోటళ్లు తెరిచేందుకు మార్గదర్శకాలను విడుదల చేసినట్లయితే.. వచ్చే జూన్​లో బెంగళూరులో హోటళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details