తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లైవ్​ వీడియో: స్కూటర్​ను ఢీకొట్టిన ఆడీ కారు - కారు

రాజస్థాన్​లోని జైపుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటర్​ను అతి వేగంగా వచ్చిన ఆడీ కారు ఢీకొట్టింది. అంతే.. స్కూటర్​లోని వ్యక్తి ఒక్కసారిగా అంతెత్తున ఎగిరిపడ్డాడు. ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

లైవ్​ వీడియో: స్కూటర్​ను ఢీకొట్టిన ఆడీ కారు

By

Published : Jul 19, 2019, 7:36 PM IST

లైవ్​ వీడియో: స్కూటర్​ను ఢీకొట్టిన ఆడీ కారు

రాజస్థాన్​ రాజధాని జైపుర్​లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జేడీఏ సర్కిల్​ వద్ద వేగంగా వస్తున్న స్కూటర్​ను ఆడీ కారు ఢీ కొట్టింది. స్కూటర్​పై ఉన్న వ్యక్తి కొన్ని మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాడు. 200 మీటర్ల వరకు స్కూటర్​ను​ లాక్కెళ్లింది కారు. ద్విచక్రవాహనంపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

కారులోని ఎయిర్​ బ్యాగు తెరుచుకోవడం వల్ల అందులోనివారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్​పై కేసు నమోదు చేశారు పోలీసులు. 15 రోజుల క్రితమే కొనుగోలు చేసి స్నేహితురాలితో కలిసి డ్రైవ్​కు వెళుతున్నట్లు కారులోని యువకుడు తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details