తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఓటు భారతం: 'తొలి' పోలింగ్ సాగిందిలా...

లైవ్​ అప్​డేట్స్​: ఓటు భారతం 2019

By

Published : Apr 11, 2019, 6:49 AM IST

Updated : Apr 11, 2019, 6:15 PM IST

2019-04-11 18:04:33

ప్రశాంతంగా ముగిసిన తొలి విడత

దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్​ పూర్తయింది. 91 లోక్​సభ నియోజకవర్గాల నుంచి పోటీలో నిలిచిన 12వందల 79మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేసింది ఓటరుగణం. 

ఉదయం 7 గంటలకంటే ముందే పోలింగ్​ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు... లైన్లలో బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్​ ముగిసింది. సమస్యాత్మక ప్రాంతాల్లోనూ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టింది.

వెబ్​క్యాస్టింగ్​ ద్వారా ఓటింగ్​ సరళిని పరిశీలించిన ఎన్నికల సంఘం.. ఎప్పటికప్పుడు ఓటింగ్​ శాతాన్ని ప్రకటిస్తూ వచ్చింది. 

నక్సల్స్​ ప్రభావిత ప్రాంతాల్లోనూ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. ఛత్తీస్​గఢ్​ బస్తర్​లో, మహారాష్ట్ర గడ్చిరోలిలో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడానికి మావోలు ఐఈడీలు పేల్చారు. కానీ.. ఎలాంటి నష్టం వాటిల్లలేదు.

మిగిలిన 6 దశల పోలింగ్​ పూర్తయ్యాక... మే 23న సార్వత్రిక ఎన్నికల ఫలితం వెలువడనుంది.

2019-04-11 17:55:03

ముగిసిన పోలింగ్​...

మొదటి విడత ఎన్నికల సమయం దాదాపు అన్ని రాష్ట్రాల్లో ముగిసింది. సమయం ముగిసే సరికి పోలింగ్​ బూత్​కు వచ్చిన వారందరికి ఓటు వేయటానికి అవకాశం ఉంటుంది. 

2019-04-11 17:39:53

బిహార్​ జముయీలో ముగిసిన పోలింగ్​

బిహార్​లో ఎన్నికలు​ జరుగుతున్న నాలుగు నియోజకవర్గాల్లో ఒకటైన జముయీలో పోలింగ్​ ముగిసింది. అధికారులు ఈవీఎంలను స్ట్రాంగ్​ రూంలకు తరలిస్తున్నారు. 

2019-04-11 17:18:23

వివిధ ప్రాంతాల్లో ఓటింగ్​ సరళి

3 గంటల వరకు కొన్ని రాష్ట్రాల్లో ఓటింగ్​ తీరు ఇలా ఉంది. 

  • ఆంధ్రప్రదేశ్             -   55 శాతం
  • అరుణాచల్​ ప్రదేశ్   ​ -   50.87 శాతం
  • సిక్కిం                      -   55 శాతం
  • మహారాష్ట్ర                -   46.13 శాతం 
  • జమ్ముకశ్మీర్            ​ -   46.17 శాతం

2019-04-11 17:04:23

శోకసంద్రం మధ్యే ఓటింగ్​కు..

భీమా మండావి కుటుంబసభ్యులు

ఛత్తీస్​గఢ్​ దంతెవాడ జిల్లాలో మంగళవారం నక్సల్స్​ దాడిలో మరణించిన భాజపా నేత, మాజీ ఎమ్మెల్యే భీమా మండావి కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండావి ప్రయాణిస్తున్న వాహనంపై మావోయిస్టులు బాంబు దాడి చేయటంతో ఆయనతో పాటు జవాన్లు కూడా మరణించారు.

2019-04-11 16:46:02

జమ్ముకశ్మీర్​లో 46.17 శాతానికి చేరిన పోలింగ్​

జమ్ముకశ్మీర్​లో తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్న జమ్ము, బారాముల్లా నియోజకవర్గాల్లో 3 గంటల వరకు 46.17 శాతం పోలింగ్​ నమోదైంది. 

2019-04-11 16:38:39

జమ్ములో ఈవీఎంలపై ఆరోపణలు- 35 శాతానికి చేరిన ఓటింగ్​

ఈవీఎంలు సరిగా పనిచేయట్లేదని జమ్ముకశ్మీర్​లో కొందరు నిరసన వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న రెండు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 35 శాతం ఓటింగ్​ నమోదైంది. 

2019-04-11 16:27:34

బిహార్​లో మందకొడిగా పోలింగ్​

బిహార్​లో నాలుగు గంటల వరకు 48.74 శాతం ఓటింగ్​ నమోదైంది. గయాలో 44 శాతం , నవాదాలో 43 శాతం, జముయీలో 41.34 శాతం, జౌరంగాబాద్​లో 38.50 శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 
2019-04-11 16:13:25

ఓటు హక్కు వినియోగించుకున్న దేవేంద్ర ఫడణవీస్‌

ఓటు హక్కు వినియోగించుకున్న దేవేంద్ర ఫడణవీస్‌

నేడు ఉదయం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌​.. సతీసమేతంగా నాగ్​పూర్​లోని ఓ పోలింగ్​ బూత్​లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 
2019-04-11 16:00:31

మూడు గంటలకు పోలింగ్​ శాతాలు

మూడు గంటల వరకు వివిధ రాష్ట్రాల్లో పోలింగ్​ శాతం వివరాలు...

  • లక్షద్వీప్​         -   51.25 శాతం
  • ఉత్తరాఖండ్​    -   46.59 శాతం
  • మణిపూర్​        -   68.90 శాతం 
  • ఛత్తీస్​గఢ్​        -   48 శాతం
  • నాగాలాండ్​     -   68 శాతం
  • తెలంగాణ       -  48.95 శాతం
  • అసోం             -   59.5 శాతం
  • మేఘాలయ    -    55 శాతం 
  • ఉత్తరప్రదేశ్​    -    50.86 శాతం
  • లక్షద్వీప్​        -   51.25 శాతం
  • ఉత్తరాఖండ్​   -  46.59 శాతం
  • మణిపూర్​       -   68.90 శాతం 
  • ఛత్తీస్​గఢ్​      -    48 శాతం
  • నాగాలాండ్​    -   68 శాతం
  • తెలంగాణ      -   48.95 శాతం
  • అసోం            -    59.5 శాతం
  • మేఘాలయ   -     55 శాతం 
  • ఉత్తరప్రదేశ్​  -      50.86 శాతం
  • మిజోరం       -      55.20 శాతం 

2019-04-11 15:35:32

ఓటింగ్​ శాతంలో దూసుకుపోతున్న మణిపూర్​

బిహార్​లో పోలింగ్​ జరుగుతున్న నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 3 గంటల వరకు 41.73 శాతం పోలింగ్​ నమోదైంది. 

2019-04-11 15:18:00

బిహార్​లో 41.73 శాతం పోలింగ్​

బిహార్​లో పోలింగ్​ జరుగుతున్న నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 3 గంటల వరకు 41.73 శాతం పోలింగ్​ నమోదైంది. 

2019-04-11 15:11:35

1 గంట వరకు వివిధ ప్రాంతాల్లో ఓటింగ్​ తీరిది

రాష్ట్రం పోలింగ్​ శాతం
పశ్చిమ బంగా 55.95
అసోం 44.33
ఆంధ్రప్రదేశ్ ​ 41 
మేఘాలయ 44.5
సిక్కిం 39.8
మిజోరం 46.5
నాగాలాండ్​ 57
ఉత్తరాఖండ్​ 41.27
అరుణాాచల్​ప్రదేశ్​ 40.95
త్రిపుర 53.17
లక్షద్వీప్​ 37.7
మణిపూర్​ 53.44

2019-04-11 15:03:55

సిక్కింలో 40 శాతం ఓటింగ్​

సిక్కింలో ఓటింగ్​​ ప్రారంభమైన 6 గంటల అనంతరం పోలింగ్​ 39.08 శాతానికి చేరుకుంది. రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక పార్లమెంటరీ నియోజకవర్గానికి ఈ దశలోనే ఎన్నిక పూర్తి కానుంది. 

2019-04-11 14:51:46

జమ్ముకశ్మీర్​లో 35.52 శాతం ఓటింగ్​

జమ్ముకశ్మీర్​లో 1 గంట వరకు 35.52 శాతం ఓటింగ్​ నమోదైంది. ఈ విడతలో రాష్ట్రంలోని జమ్ము, బారాముల్లా పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఎన్నిక కొనసాగుతోంది. 

2019-04-11 14:44:48

ఈసీకి 39 ఫిర్యాదులు చేసిన కాంగ్రెస్​

మహారాష్ట్రలో పోలింగ్​ జరుగుతున్న ఆరు నియోజకవర్గాల్లో ఈవీఎంలకు సంబంధించి కాంగ్రెస్​ పార్టీ ఎన్నికల సంఘానికి 39 ఫిర్యాదులు చేసింది.  ఈ రాష్ట్రంలో మొత్తం ఏడు లోక్​సభ స్థానాలకు ఎన్నిక కొనసాగుతోంది.

2019-04-11 14:28:48

బిహార్​లో మూడోవంతు ఓటు హక్కు వినియోగం

బిహార్​లో రెండు గంటల వరకు 35.49 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ విడతలో నాలుగు పార్లమెంటరీ స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. నవాదాలో 39 శాతం, జముయీలో 32.5 శాతం, జౌరంగాబాద్​లో 36.2 శాతం, గయాలో 38 శాతం పోలింగ్​ నమోదైంది. 

2019-04-11 13:59:17

బిహార్​లో పోలింగ్​ సరళి...

ఉత్తర్​ప్రదేశ్​ కైరానా పరిధిలోని రసూల్​పుర్​ పోలింగ్​ బూత్​పై స్థానిక యువత రాళ్లతో దాడి చేశారు. ఓ బీఎస్​ఎఫ్​ జవాన్​ గాల్లోకి కాల్పులు జరిపాడు. అనంతరం ఘర్షణ వాతావరణం నెలకొనగా.. పోలీసులొచ్చి వారిని చెదరగొట్టారు. 
 
2019-04-11 13:51:19

పోలింగ్​ బూత్​పై యువత రాళ్లదాడి

పోలింగ్​ బూత్​పై రాళ్ల దాడి

ఉత్తర్​ప్రదేశ్​ కైరానా పరిధిలోని రసూల్​పుర్​ పోలింగ్​ బూత్​పై స్థానిక యువత రాళ్లతో దాడి చేశారు. ఓ బీఎస్​ఎఫ్​ జవాన్​ గాల్లోకి కాల్పులు జరిపాడు. అనంతరం ఘర్షణ వాతావరణం నెలకొనగా.. పోలీసులొచ్చి వారిని చెదరగొట్టారు. 
 
2019-04-11 13:31:49

ఉత్తరాఖండ్​లో 41.27 శాతం...

ఉత్తరాఖండ్​లో మధ్యాహ్నం ఒకటి గంటల వరకు 41.27 శాతం పోలింగ్​ నమోదైంది. 
 
2019-04-11 13:12:50

ఓటుహక్కు వినియోగించుకున్న రామ్​దేవ్​ బాబా

దేశవ్యాప్తంగా పోలింగ్​ బూత్​లకు వచ్చిన వృద్ధులకు, వికలాంగులకు ఎన్నికల సిబ్బంది సహాయపడుతున్నారు. బిహార్​ గయాలో సీఆర్​పీఎఫ్​ సిబ్బంది... వృద్ధులు, వికలాంగులను స్వయంగా ఎత్తుకెళ్లి పోలింగ్​ కేంద్రం లోపలికి చేరుస్తూ చేయూతనిస్తున్నారు. 

2019-04-11 13:02:12

వృద్ధులు, వికలాంగులకు చేయూతగా సిబ్బంది.

దేశవ్యాప్తంగా పోలింగ్​ బూత్​లకు వచ్చిన వృద్ధులకు, వికలాంగులకు ఎన్నికల సిబ్బంది సహాయపడుతున్నారు. బిహార్​ గయాలో సీఆర్​పీఎఫ్​ సిబ్బంది... వృద్ధులు, వికలాంగులను స్వయంగా ఎత్తుకెళ్లి పోలింగ్​ కేంద్రం లోపలికి చేరుస్తూ చేయూతనిస్తున్నారు. 

2019-04-11 12:46:50

ఓటేసిన ప్రపంచంలోనే పొట్టి మహిళ

లైవ్​ అప్​డేట్స్​: ఓటు భారతం 2019

11 గంటల వివిధ ప్రాంతాల్లో పోలింగ్​ వివరాలు ఈ విధంగా ఉన్నాయి..

రాష్ట్రాలు  ఓటింగ్​ శాతం
నాగాలాండ్​ 41
మేఘాలయ 27
అరుణాచల్​ ప్రదేశ్​ 27.48
తెలంగాణ 22.84
మిజోరం 29.8
పశ్చిమ బంగా 38.08
మణిపూర్​ 35.03
మహారాష్ట్ర 13.7
ఉత్తరప్రదేశ్​ 24.32
జమ్ముకశ్మీర్​ 24.66
అసోం 25
త్రిపుర 26.5
ఉత్తరాఖండ్​ 23.78
లక్ష ద్వీప్​ 23.10
మహారాష్ట్ర 13.7
ఒడిశా 22

2019-04-11 12:28:09

బిహార్​లో 24.57 శాతం పోలింగ్​

లైవ్​ అప్​డేట్స్​: ఓటు భారతం 2019

ఛత్తీస్​గఢ్​లో 11 గంటల వరకు 21.1 శాతం ఓటింగ్​ నమోదైంది. ఈ విడతలో రాష్ట్రంలోని బస్తర్​ నియోజకవర్గంలో మాత్రమే ఎన్నిక జరుగుతోంది. ఒకవైపు పోలింగ్​ జరుగుతుండగానే....  పక్కనే ఉన్న బీజాపూర్​ జిల్లాలో నలుగురు నక్సలైట్లను పోలీసులు అరెస్టు చేశారు. మూడు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. 
 
2019-04-11 12:24:27

పోలింగ్​ బూత్​ వద్ద ఐఈడీలను పేల్చిన నక్సలైట్లు

అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌... దిబ్రూగర్‌ నియోజకవర్గంలోని ఒక పోలింగ్​ బూత్​లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

2019-04-11 11:55:22

11 గంటల వరకు పోలింగ్​ తీరు

బిహార్​లో 10 గంటల వరకు 13.73 శాతం ఓటింగ్​ నమోదైంది. 7 గంటలకు ముందు నవాదా నియోజకవర్గంలో కొన్ని ఈవీఎంలు మొరాయించగా... గయా జిల్లాలోని ఒక బూత్​లో ఒక​ బాంబును గుర్తించారు సిబ్బంది. 
 
2019-04-11 11:47:47

ఛత్తీస్​గఢ్​లో 21.1 శాతం పోలింగ్​

9 గంటల వరకు  వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఓటింగ్​ వివరాలు :

రాష్ట్రం పోలింగ్​ శాతం
పశ్చిమ బంగా 18.12
మిజోరం 17.5
ఛత్తీస్​గఢ్ 10.2
మణిపూర్​ 15.6

2019-04-11 11:23:17

ఓటు హక్కు వినియోగించుకున్న అసోం ముఖ్యమంత్రి

నాగ్​పూర్​ లోక్​సభ నియోజకవర్గంలోని 220వ పోలింగ్​ బూత్​లో కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 
2019-04-11 11:13:08

బిహార్​లో 10 గంటల వరకు 13.73 శాతం పోలింగ్​

2019-04-11 10:36:13

వివిధ రాష్ట్రాల్లో ఓటింగ్​ శాతం...

  • నాగాలాండ్​ - 21 శాతం
  • అరుణాచల్​ప్రదేశ్​ - 13.3 శాతం
  • అస్సాం - 10.2 శాతం
  • లక్ష ద్వీప్​ - 9.83 శాతం
  • అండమాన్​ నికోబార్​ -5.83 శాతం
     
2019-04-11 10:29:22

నాగ్​పూర్​లో ఓటేసిన నితిన్​ గడ్కరీ

దేశ భవిష్యత్తు కోసం వివేకంతో  ఓటేయాలని రాహుల్​ గాంధీ ట్వీట్టర్​ వేదికగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో మోదీ ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ.. వ్యంగ్యాస్తాలు సంధించారు. 

" 2 కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు, మంచి రోజులు రాలేదు. వీటికి బదులు నోట్ల రద్దు, రైతు సంక్షోభం, గబ్బర్​సింగ్​ పన్ను, సూటు బూటు ప్రభుత్వం, రఫేల్​, అబద్ధాలు, అవిశ్వాసం, హింస, ద్వేషం వచ్చాయి"  -  రాహుల్​గాంధీ ట్వీట్​. 

2019-04-11 10:24:18

నక్సల్స్​ హెచ్చరికలు బేఖాతరు- పోలింగ్​కు భారీగా ఓటర్లు

ఒకవైపు లోక్​సభ ఎన్నికలు కొనసాగుతోన్న వేళ.. ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఈ విడతలో పోలింగ్​ జరుగుతోన్న ఒకే ఒక నియోజకవర్గం 'బస్తర్'​లో ఉదయం 4.15 గంటలకు శక్తిమంతమైన ఐఈడీని(మెరుగుపరచిన పేలుడు పదార్థం) పేల్చినట్లు అధికారులు తెలిపారు. భద్రతా సిబ్బంది వేరే దారి గుండా వెళ్లటం వల్ల వారికి ఎలాంటి హాని జరగలేదు. 

2019-04-11 10:23:55

దేశంలోని మొత్తం 91 లోక్​సభ స్థానాలకు కాసేపట్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 14 కోట్ల 20 లక్షల 54 వేల మంది ఓటర్లు 1279 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. మిగిలిన 6 విడతల పోలింగ్ ముగిశాక మే 23న ఫలితాలు వెలవడనున్నాయి.

2019-04-11 10:06:27

9 గంటల వరకు ఓటింగ్​ శాతం

నాగాలాండ్​లో ఉన్న ఒకే ఒక లోక్​సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికలో 9 గంటల వరకు 21 శాతం పోలింగ్​ నమోదైంది. అదే సమయానికి బిహార్​లోని 4 లోక్​సభ నియోజకవర్గాల్లో 7 నుంచి 8 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

2019-04-11 09:57:40

వివేకంతో ఓటేయండి : రాహుల్​ గాంధీ

మొదటి విడత లోక్​సభ ఎన్నికల పోలింగ్​ జోరుగా కొనసాగుతోంది. ప్రజలు భారీ క్యూలైన్లలో నిలబడి ఉత్సాహంగా ఓటేస్తున్నారు. వృద్ధులు కూడా పోలింగ్​ కేంద్రాలకు తరలివస్తున్నారు.  అక్కడక్కడ ఈవీఎంలు మొరాయిస్తున్నప్పటికీ.. అధికారులు సమస్యను పరిష్కరిస్తున్నారు. 

2019-04-11 09:42:43

పోలింగ్​ జరుగుతోన్న నియోజకవర్గంలో ఐఈడీలను పేల్చిన నక్సల్స్​

ఉత్తరప్రదేశ్​ బాగ్​పత్​ నియోజకవర్గానికి చెందిన బడౌత్​లోని ఓ పోలింగ్​ బూత్​లో ఓటర్లపై పూలు జల్లుతూ ఆహ్వానం పలుకుతున్నారు సిబ్బంది. 
 
2019-04-11 09:32:54

నాగాలాండ్​లో 21 శాతం, బిహార్​లో 7 నుంచి 8 శాతం పోలింగ్​...

మేఘాలయలో పోలింగ్​ ఇప్పుడే పుంజుకుంటోంది. పశ్చిమ కాసీ హిల్స్​ పోలింగ్​ కేంద్రంలో మొదట ఓటేసిన ఐదుగురిని ఎన్నికల సంఘం మెడల్స్​తో సత్కరించింది. 

2019-04-11 09:24:47

ఓటేసిన ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రి

ఆర్​ఎస్​ఎస్​ అధినేత మోహన్​ భగవత్​ నాగ్​పుర్​లో ఓటేశారు. ఓటు వేయడం మన బాధ్యతని, ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
 
2019-04-11 09:16:54

జోరుగా కొనసాగుతోన్న పోలింగ్​...

సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్​ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్​ చేశారు. ఓటర్లంతా తరలివచ్చి పోలింగ్​లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తొలిసారి ఓటర్లు తప్పక ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు మోదీ.

2019-04-11 08:05:07

పూలతో ఆహ్వానం...

సిక్కింలో ఉన్న ఒకే ఒక స్థానానికి పోలింగ్​ జరుగుతోంది. 32 శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం కూడా ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు ఓటర్లు. 
 
2019-04-11 07:55:54

ఈశాన్యాన జోరుగా...

ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్​ ప్రదేశ్​లో ఉన్న రెండు లోక్​సభ స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్​ పూర్తి కానుంది. ఈ రాష్ట్రంలో ఉన్న 60 విధానసభ సీట్లలో మూడు ఏకగ్రీవం కాగా... మిగిలిన 57 స్థానాల్లో ఓటింగ్​ జరుగుతోంది. 

45 కంపెనీల కేంద్ర బలగాలు , 7000 మంది పౌర పోలీసులు ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. 
 
2019-04-11 07:29:25

అందరికన్నా ముందే...

విధానసభ, లోక్​సభ ఎన్నికలు జరుగుతున్న వాటిలో రెండో పెద్ద రాష్ట్రం ఒడిశా. ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం 21 లోక్​సభ సీట్లకుగాను నాలుగింటికి ఎన్నిక జరుగుతోంది. వీటి పరిధిలోని 28 శాసనసభ స్థానాలకూ పోలింగ్​ జరుగుతోంది. 

మొదటి విడతలో ఓటు హక్కు వినియోగించుకునే వారిలో మహిళలే ఎక్కువ. ఈ విడతలో ఎన్నికల జరగనున్న మొత్తం లోక్​సభ, అసెంబ్లీ సెగ్మెంట్​లు నక్సల్​ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. మల్కాన్​గిరి లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో హెలికాప్టర్​ల ద్వారా పోలింగ్​ సిబ్బందిని తరలించారు. 

2019-04-11 07:26:02

ఓటరులారా కదిలిరండి....

2019-04-11 07:24:06

సిక్కిం...

2019-04-11 07:21:42

అరుణాచల్​ ప్రదేశ్​

2019-04-11 07:16:35

ఒడిశాలో...

2019-04-11 06:51:34

రాష్ట్రాలకూ....

లైవ్​ అప్​డేట్స్​: ఓటు భారతం 2019

దేశంలోని మొత్తం 91 లోక్​సభ స్థానాలకు కాసేపట్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 14 కోట్ల 20 లక్షల 54 వేల మంది ఓటర్లు 1279 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. మిగిలిన 6 విడతల పోలింగ్ ముగిశాక మే 23న ఫలితాలు వెలవడనున్నాయి.

2019-04-11 06:39:51

కాసేపట్లో....

Last Updated : Apr 11, 2019, 6:15 PM IST

ABOUT THE AUTHOR

...view details