మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమంగానే ఉందని ఆర్మీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ మేరకు సాయంత్రం ప్రణబ్ మెడికల్ బులిటెన్‌ను విడుదల చేశాయి. పరిస్థితి విషమంగా ఉంటడం వల్ల వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
ఆందోళనకరంగానే ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం
18:27 August 11
13:36 August 11
ప్రణబ్ ఆరోగ్యంపై బులిటెన్ విడుదల...
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి (ఆర్ఆర్)లో సోమవారం ఆయనకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. మెదడులో ఏర్పడ్డ క్లాట్స్ ను తొలగించేందుకు శస్త్రచికిత్స చేశారు. అయితే ఆపరేషన్ పూర్తయినా ప్రణబ్ పరిస్థితి విషమంగానే ఉందని, వెంటిలేటర్ సపోర్టును అందిస్తున్నామని ఆసుపత్రి తాజాగా మెడికల్ బులిటెన్ విడుదల చేసింది.
బ్రెయిన్ సర్జరీకి ముందు నిర్వహించిన టెస్టుల్లో పణబ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణయింది. ఆయన ఆగస్ట్ 10న రాత్రి 12.07 నిమిషాలకు ఆర్ఆర్ ఆసుపత్రిలో చేరారు.
09:10 August 11
మాజీ రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితిపై పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు.
కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ ట్వీట్ చేయగా.. తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థించాలని ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ ప్రజలను కోరారు.
ముఖర్జీ కరోనా బారిన పడటంపై కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్లప్పుడు చురుగ్గా ఉండే ముఖర్జీకి త్వరగా స్వస్థత చేకూరాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా ముఖర్జీ కోలుకుంటారని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సైతం ముఖర్జీ కోలుకోవాలని ట్వీట్ చేశారు.
ప్రణబ్ ముఖర్జీ త్వరగా కరోనా నుంచి బయటపడతారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధినేత స్టాలిన్ సహా పలువురు ప్రముఖులు ప్రణబ్ కోలుకోవాలని ట్వీట్లు చేశారు.
08:37 August 11
కోలుకోవాలని ఆకాంక్షించిన కోవింద్
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రణబ్‌ను వెంటిలేటర్‌పై ఉంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
సోమవారం ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో ఆయనకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. మెదడులో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించేందుకు సర్జరీ నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆయన ఆరోగ్యం స్థిమితంగానే ఉందని పేర్కొన్నారు. వైద్య నిపుణుల బృందంతో ముఖర్జీ ఆరోగ్యాన్ని పర్యవేక్షణిస్తున్నట్లు వెల్లడించారు.
అంతకుముందు ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. తనను కలిసినవారందరూ పరీక్షలు చేయించుకోవాలని ప్రణబ్ సూచించారు.
ప్రముఖుల పరామర్శ
ఈ నేపథ్యంలో ప్రణబ్ ముఖర్జీ త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. ముఖర్జీ కుమార్తెతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.