తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రంగస్థలంలో రాజకీయ నాయకుల నాటకం - నేతలు

మైక్​ పట్టుకుని ప్రసంగాలు చేసే రాజకీయ నేతలు... మేక్​అప్​ వేసుకుని రంగస్థలంపై మెరిశారు. ఓటు వేయాలంటూ ఇన్ని రోజులు అభ్యర్థించిన నాయకులు... కిరీటాలు ధరించి పెద్దపెద్ద డైలాగులు చెప్పారు. ఇదంతా కర్ణాటకలోని బుడికట్టె గ్రామం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర జాతరలో జరిగింది.

రంగస్థలంలో రాజకీయ నాయకుల నాటకం

By

Published : Apr 29, 2019, 6:38 AM IST

రంగస్థలంలో రాజకీయ నాయకుల నాటకం

దేశవ్యాప్తంగా ఎన్నికల జోరు కొనసాగుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా సార్వత్రిక ఎన్నికలే హాట్​ టాపిక్​. అగ్రనేతలందరూ ఎన్నికల ప్రచారాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. మూడో దశతో కర్ణాటకలో ఎన్నికలు ముగిసాయి. ఇన్ని రోజులు ప్రచార సభల్లో తలపడ్డ రాష్ట్ర నాయకులు... తాజాగా రంగస్థలంపై పోటీపడ్డారు. ఇందుకు కోలార్​ జిల్లాలోని బుడికట్టె గ్రామం వేదికైంది.

బుడికట్టె గ్రామంలో ఏటా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర జాతర ఘనంగా జరుగుతుంది. జాతరలో నాటకరంగ కళాకారులు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. కానీ ఈసారి జరిగిన సుయోధన నాటకంలో రాజకీయ నాయకులు తళుక్కున మెరిసి ప్రజలను అలరించారు.

అంబెడ్కర్​ అభివృద్ధి కార్పొరేషన్ అధ్యక్షుడు,​ బంగారపేట ఎమ్మెల్యే, ఇతర జిల్లా రాజకీయ నేతలు ఈ నాటకంలో పాల్గొన్నారు. ఇందులో జిల్లా, తాలూకా, గ్రామ పంచాయతీ సభ్యులూ ఓ చేయి వేశారు. ఈ నాటకంలో ఎమ్మెల్యే నారాయణ కృష్ణుడి పాత్ర పోషించారు.

"నాటకం చేయాలని నిర్వాహకులు నన్ను సంప్రదించారు. నేను నిత్యం రాజకీయం, వ్యాపారాల్లో బిజీబిజీగా గడపుతాను. ప్రజలకు దగ్గరయ్యేందుకు నాటకాలు ఎంతో ఉపయోగపడతాయి. నాటకాలలో పాలుపంచుకోవడం నాకూ ఇష్టమే. ఇందులో నన్ను కృష్ణుడి పాత్ర పోషించమని అడిగారు. ఈ పాత్రకు ఎంతో విశిష్టత ఉంటుంది. అందుకే నేను ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాను"
--- నారాయణస్వామి, ఎమ్మెల్యే.

నిత్యం రాజకీయాల్లో బిజీబిజీగా ఉండే తమకు ఈ నాటకం సరికొత్త అనుభూతిని కలిగించిందని నేతలు హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:ఆస్ట్రేలియా లక్ష్యం- 20 లక్షల పిల్లులు!

ABOUT THE AUTHOR

...view details