తెలంగాణ

telangana

ETV Bharat / bharat

న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం- 12 మంది అరెస్టు - జాతీయ నేర వార్తలు

ఝార్ఖండ్​లో ఓ న్యాయ విద్యార్థిని కొంతమంది దుండగులు బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 12 మంది అనుమానితులను అరెస్టు చేశారు పోలీసులు. వారి నుంచి ఆయుధాలు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

JH-GANGRAPE
JH-GANGRAPE

By

Published : Nov 29, 2019, 2:05 PM IST

ఝార్ఖండ్​ రాజధాని రాంచీలో దారుణం జరిగింది. 25 ఏళ్ల న్యాయవిద్యార్థిని ఆయుధాలతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. నవంబర్​ 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కాంకే ఠాణాలో బాధితురాలు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

స్నేహితుడిని కొట్టి..

మంగళవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో సంగ్రామ్​పుర్​ శివారుల్లో ఆ యువతి స్నేహితుడితో కలిసి ఉండగా ఈ దారుణం జరిగింది. ఆయుధాలతో వచ్చిన కొంతమంది ఆమె స్నేహితుడిని కొట్టి.. బాధితురాలిని కొంతదూరం తీసుకెళ్లి అత్యాచారం చేశారు.

పోలీసులు నిందితుల నుంచి కారు, బైక్​, ఒక తుపాకీ, 8 మొబైల్​ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలి నుంచి దొంగలించిన మొబైల్​ను సీజ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details