అయోధ్యలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రామ మందిరం నిర్మాణం కోసం భూమి పూజ జరిగిన నెల రోజుల్లోపే ధరలు రెట్టింపయ్యాయి.
నిజానికి అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాతే 30 నుంచి 40 శాతం ధరలు పెరిగాయి. దీంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో భూముల ధరలు ఆకాశానికి చేరాయి.
అయోధ్యను భారతదేశ 'వాటికన్ సిటీ'గా తీర్చిదిద్దుతామన్న యోగి ఆదిత్యనాథ్ హామీతో.. భూముల డిమాండ్ అమాంతం పెరిగింది. ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం, మూడు నక్షత్రాల హోటళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో భూముల ధరలు పెరిగిపోయాయి.
"అయోధ్యలో రామ మందిర భూమి పూజ నిర్వహించిన తర్వాత పెద్ద వ్యాపారులు ఇక్కడ హోటళ్లు, ధర్మశాలలు నిర్మించాలని అనుకుంటున్నారు. దీంతో స్థానిక డీలర్లను సంప్రదిస్తున్నారు. ఇలా డిమాండ్ భారీగా పెరుగుతోంది."