తెలంగాణ

telangana

లాలూ ప్రసాద్​కు బెయిల్​... అయినా జైలులోనే

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​కు బెయిల్ లభించింది. దాణా కుంభకోణానికి సంబంధించి చాయీబాసా ట్రెజరీ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది ఝార్ఘండ్ హైకోర్టు. అయితే ఈ కుంభకోణంలో దమ్కా ట్రెజరీ కేసు ఇంకా పెండింగ్​లోనే ఉన్న నేపథ్యంలో ఆయన జైలులోనే ఉండనున్నారు.

By

Published : Oct 9, 2020, 12:57 PM IST

Published : Oct 9, 2020, 12:57 PM IST

Lalu Yadav granted bail in case related to fodder scam
లాలూ ప్రసాద్​కు బెయిలు... అయినా జైలే దిక్కు

దాణా కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్​కు బెయిల్ లభించింది. చాయీబాసా ట్రెజరీ కేసులో ఆయనకు ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే దమ్కా ట్రెజరీ కేసు ఇంకా పెండింగ్​లో ఉన్న కారణంగా.. లాలూ ఇంకా జైలులోనే ఉండనున్నారు.

గతంలో బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన లాలూ.. 1992-93 సమయంలో చాయీబాసా ట్రెజరీ నుంచి రూ.33.67 కోట్లు అక్రమంగా ఉపసంహరించుకున్నారన్న కేసులో ఆయనకు బెయిల్ వచ్చింది.

డిసెంబర్ 2017 నుంచి లాలూ ప్రసాద్ యాదవ్.. జైలులోనే ఉన్నారు. దాణా కుంభకోణం కేసులో 2017లో ఆయనకు ఏడేళ్ల శిక్ష పడింది. ప్రస్తుతం అనారోగ్యం పాలైన లాలూ.. రాజేంద్ర ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్​ (రిమ్స్​)లో చికిత్స పొందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details