ఆర్జేడీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం సరిగా లేదని వైద్యుల తెలిపారు. కొంత కాలంగా లాలూ మూత్ర పిండాల సమస్యతో బాధ పడుతున్నారు. చక్కెర, రక్తపోటు స్థాయిలో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. ఈ క్రమంలో ఆయన ఆహారం తక్కువగా తీసుకుంటాన్నారని, మెరుగైన చికిత్స అందిస్తున్నామని వెద్యులు ప్రకటన చేశారు.
కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న లాలూ ప్రసాద్ - మూత్ర పిండాల సమస్య
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం స్థిరంగా లేదని వైద్యలు తెలిపారు. కొంత కాలంగా ఆయన కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.
కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న లాలూ ప్రసాద్
దాణా కుంభకోణానికి సంబంధించిన 3 కేసుల్లో లాలూ దోషిగా తేలారు. రూ.900 కోట్ల ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆర్జేడీ అధినేత. లాలూ ప్రస్తుతం రాంచీలోని బిర్సా ముండా కారాగారంలో శిక్షను అనుభవిస్తున్నారు.
ఇదీ చూడండి:కర్ణాటక: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సీబీఐ చేతుల్లోకి...
Last Updated : Sep 29, 2019, 1:02 AM IST