తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరిగా నిద్రపోవడం లేదా? గుండె జబ్బులు తప్పవు!

నిద్రలేమి సమస్య గుండె జబ్బులకు కారణమౌతుందని తేల్చింది స్విట్జర్లాండ్​లోని యూనిసాంట్ విశ్వవిద్యాలయం వారు చేసిన అధ్యయనం. పేదల్లో గుండెజబ్బులకు నిద్రలేమి ఓ కారణమని పేర్కొంది.

సరిగా నిద్రపోవడం లేదా? గుండె జబ్బులు తప్పవు!

By

Published : Nov 24, 2019, 11:00 AM IST

సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వారిలో గుండె సమస్యలకు సరిపోయినంత నిద్ర లేకపోవడమూ ఓ కారణమేనని పేర్కొంది తాజా అధ్యయనం. ఆర్థికంగా వెనకబడిన వారు పలు రకాల కారణాలతో నిద్రలేమితో బాధపడుతున్నారని స్విట్జర్లాండ్​లోని జనరల్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్​ (యూనిసాంట్) విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం తేల్చింది.

పలు రకాల ఉద్యోగాలు చేయడం, షిఫ్టుల వారిగా పని, శబ్దాల మధ్య నివాసాలు, హెచ్చుస్థాయిలో మానసిక, ఆర్థిక ఒత్తిళ్లతో ఉండటం దీనికి కారణమని నివేదిక పేర్కొంది. తక్కువ సమయం నిద్రపోవడమే పేదల్లో హృద్రోగాలు ఎక్కువగా ఉండటానికి కారణమని 'కార్డియోవాస్కులార్ రీసెర్చ్' పేరిట విడుదల చేసిన జర్నల్​లో స్పష్టం చేసింది.

తక్కువ సమయం నిద్రపోయే పురుషుల్లో 13.4 శాతం మందిలో చేసేపనికి హృద్రోగాలకు మధ్య సంబంధం ఉన్నట్లు వెల్లడించిందీ నివేదిక.

"పురుషులతో పోల్చితే తక్కువ నిద్రపోయే మహిళల్లో పని ఒత్తిడి, నిద్ర వ్యవధి మధ్య వ్యత్యాసం తక్కువగా ఉండటం కారణంగా గుండె సమస్యలు తక్కువగా ఉంటున్నాయి."

-డుసాన్ పెట్రోవిక్, యూనిసాంట్ విశ్వవిద్యాలయం

సరిపోయినంత నిద్రకోసం సమాజంలోని ప్రతి అంచెలో నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమని నివేదిక ఉద్ఘాటించింది. నిద్రకు ఇబ్బంది కలిగించే శబ్దాల నియంత్రణ కోసం బలమైన కిటీకీలు ఉపయోగించాలని, ట్రాఫిక్​ను తగ్గించాలని, విమానాశ్రయాలు.. హైవేల పక్కన ఇళ్ల నిర్మాణం చేపట్టకూడదని నివేదిక వెల్లడించింది.

1, 11, 205 మందిపై చేసిన ఈ అధ్యయనంలో.. పాల్గొన్నవారిని ఎనిమిది బృందాలుగా విభజించి ఈ పరిశోధన చేపట్టారు. కుటుంబ పెద్ద, వ్యక్తిగతంగా తాను చేస్తోన్న పనిని బట్టి తక్కువ, మధ్యతరగతి, ఉన్నత వర్గాలుగా విభజించి ఈ పరిశోధన చేశారు. హృదయ ధమనుల్లో వ్యాధులను.. వైద్యుడి అభిప్రాయం, వైద్య పరీక్షలు, ఇంతకుముందు ఆరోగ్య నివేదికల ఆధారంగా నిర్ణయించారు.

సాధారణ నిద్రను ఆరు నుంచి ఎనిమిదిన్నర గంటలుగా, ఆరు గంటల్లోపు పడుకుంటే తక్కువ నిద్రగా, ఎనిమిదిన్నర గంటలకు మించి పడుకుంటే అతినిద్రగా నివేదిక అభివర్ణించింది.

ఇదీ చూడండి: 'అరుంధతి' మృతికి బ్యాక్టీరియానే కారణం!

ABOUT THE AUTHOR

...view details