గల్వాన్ ఘటన తర్వాత నుంచి భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. భారత భూభాగాన్ని కైవసం చేసుకోవాలని చైనా కుట్రలు పన్నుతుంటే.. భారత్ గట్టిగా సమాధానమిస్తూ వస్తోంది. ప్రతిష్టంభనకు తెరదించేందుకు సైనిక, దౌత్య స్థాయిల్లో దఫదఫాలుగా చర్చలు జరుపుతున్నా... ఎలాంటి పురోగతి కనిపించడంలేదు. చర్చలు జరుగుతున్నప్పటికీ ఇరుదేశాల బలగాలను, ఆయుధాలను, యుద్ధ ట్యాంకర్లను పోటాపోటీగా మోహరిస్తున్నాయి.
సైనిక శకిసామర్థ్యాల పరంగా భారత్, చైనా ప్రపంచంలోనే టాప్-5లో ఉన్నాయి.
అంశం | భారత్ | చైనా |
ప్రపంచ ర్యాంక్ | 5 | 3 |
బడ్జెట్(డాలర్లలో) | 65.9 బిలియన్లు | 228 బిలియన్లు |
బలగాలు(యాక్టివ్) | 21,40,000 | 23,00,000 |
మానవ వనరులు | 31,91,29,420 | 38,58,21,101 |
యుద్ధ ట్యాంక్లు | 4426 | 7760 |
యుద్ధ వాహనాలు | 5681 | 6000 |
ఆర్టిలరీ | 5067 | 9726 |
సెల్ప్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ | 290 | 1710 |
రాకెట్ ఆర్టిలరీ | 292 | 1770 |