తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతులకు మద్దతుగా దిల్లీ సరిహద్దులో 'సెలూన్' - రైతుల ఆందోళన

అందరిలాగే నిరసనల్లో పాల్గొని నినాదాలు చేస్తే సరిపోతుంది అనుకోలేదు అతడు. అన్నం పెట్టే రైతన్న ఆవేదనను అర్ధం చేసుకున్నాడు. వారికి సాయం చేయాలని అనుకున్నాడు. వెంటనే తన ఐదుగురు పనివాళ్లతో కలిసి సింఘూ సరిహద్దుకు వెళ్లాడు. ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడు? ఏ విధంగా రైతులకు మద్దతుగా నిలిచాడు?

Kurukshetra man opens free makeshift salon for protesting farmers at Singhu border
రైతులకు మద్దతుగా దిల్లీ సరిహద్దులో 'సెలూన్'

By

Published : Dec 19, 2020, 9:11 AM IST

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా నిలుస్తోన్న కొందరు.. తమవంతు సాయంగా కూరగాయలు, సరుకులు అందిస్తున్నారు.

రైతులకు మద్దతుగా దిల్లీ సరిహద్దులో 'సెలూన్'

అయితే హరియాణాలోని కురుక్షేత్రకు చెందిన ఓ యువకుడు మాత్రం విభిన్నంగా ఆలోచించాడు. రైతులకు తనదైన శైలిలో మద్దతు తెలపాలని అనుకున్నాడు. ఆందోళనలు జరిగే చోట రైతుల కోసం ఓ సెలూన్​ ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావించాడు. అంతే... మరోమారు ఆలోచించకుండా తన పనివాళ్లతో కలిసి సింఘూ సరిహద్దుకు చేరుకున్నాడు.

"కురుక్షేత్రలో నా సెలూన్​కు వచ్చేవాళ్లలో 90శాతం మంది రైతులే. వారంతా ఆందోళనలో పాల్గొనేందుకు సింఘూ సరిహద్దుకు వచ్చారు. వారికి నా వంతు సాయం అందించేందుకు నేనూ ఇక్కడికే వచ్చాను. కురుక్షేత్రలో సెలూన్​ మూసేసి.. ఇక్కడ ఉచితంగా వారికి నా సేవలు అందించాలని నిర్ణయించుకున్నా. ఆందోళన ముగిసేంతవరకూ నేను, నా సెలూన్​ సిబ్బంది ఇక్కడే ఉంటాం."

-లబ్​ సింగ్, సెలూన్​ ఓనర్.

రైతులకు మద్దతుగా నిలిచేందుకు వచ్చిన లబ్​ సింగ్​ సరిహద్దుల్లో తన సేవలు అందించడంపై ఆనందం వ్యక్తం చేశాడు. తన దగ్గర పనిచేసేవాళ్లకు.. తన సొంత డబ్బులను జీతంగా ఇస్తానన్నాడు.

"చాలా రోజుల నుంచి నేను సెలూన్​ నడుపుతున్నాను. భగవంతుని దీవెనల వల్ల ఆర్థికంగా బాగానే ఉన్నాను. సెలూన్​లో పనిచేసే వారికి జీతాలు ఇవ్వడానికి నేను ఇన్ని రోజులు ఆదా చేసిన డబ్బు సరిపోతుంది."

-లబ్​ సింగ్, సెలూన్​ ఓనర్.

తమ కోసం సెలూన్​ ఏర్పాటు చేసి ఉచితంగా సేవలందిస్తున్న లబ్​సింగ్​ను ప్రశంసిస్తున్నారు సింఘూ సరిహద్దుల్లోని పంజాబ్​, హరియాణా రైతులు.

ఇదీ చదవండి:రైతులకు మద్దతుగా తమిళ విపక్షాల దీక్ష

ABOUT THE AUTHOR

...view details