కర్ణాటక రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి. ఇప్పటికే ఎమ్మెల్యేల రాజీనామాలతో సతమతమవుతున్న వేళ శాసనసభలో బలపరీక్షకు సిద్ధమని ప్రకటించారు. ఈ మేరకు స్పీకర్ రమేశ్ కుమార్ అనుమతి కోరారు సీఎం.
"నేను దేనికైనా సిద్ధంగా ఉంటా. కుర్చీకే అతుక్కుపోవాలని ఇక్కడికి రాలేదు. మీరు (స్పీకర్) సమయం చెప్పండి. మా బలాన్ని నిరూపించుకుంటాం."