తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఖర్గేది అసమ్మతి అంతులేనిది: అరుణ్​జైట్లీ

సీబీఐ డైరెక్టర్​గా రిషికుమార్​ నియామకాన్ని వ్యతిరేకిస్తూ మల్లికార్జున ఖర్గే అసమ్మతి లేఖ రాయడంపై కేంద్రమంత్రి అరుణ్​జైట్లీ స్పందించారు. ఈ అంశాన్ని రాజకీయం చేసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు.

ఖర్గే

By

Published : Feb 3, 2019, 7:12 PM IST

కాంగ్రెస్​ నేత మల్లికార్జున ఖర్గే 'అసమ్మతి లేఖ'పై కేంద్రమంత్రి అరుణ్​జైట్లీ స్పందించారు. తామేం చేసినా ఖర్గే క్రమం తప్పకుండా అసమ్మతి తెలుపుతూనే ఉంటారని ఎద్దేవా చేశారు.

సీబీఐ డైరెక్టర్​గా రిషికుమార్ శుక్లా నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రికి లేఖ రాశారు మల్లికార్జున ఖర్గే. ఈ లేఖపై జైట్లీ తన బ్లాగ్​లో స్పందించారు. సీబీఐ నూతన డైరెక్టర్​ నియామకానికి రాజకీయ రంగు పులమాలని విపక్ష నేత ఖర్గే ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వైద్యం కోసం జైట్లీ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు.

అసలేం జరిగిందంటే...

సీబీఐ డైరెక్టర్​ నియామకం కోసం ఏర్పాటైన ముగ్గురు సభ్యల అత్యున్నత కమిటీ రిషికుమార్​ను ఎంపిక చేసింది. ఈ కమిటీకి ప్రధాని నేతృత్వం వహించగా.. సభ్యులుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయ్, లోక్​సభలో ప్రధాన ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే ఉన్నారు. సీబీఐ డైరక్టర్​గా రిషికుమార్ శుక్లా నియామకంపై ఖర్గే అభ్యంతరం చెప్పినా ఫలితం లేకపోయింది. రిషికుమార్ వైపే మొగ్గుచూపింది కమిటీ.

ABOUT THE AUTHOR

...view details