తెలంగాణ

telangana

By

Published : Mar 15, 2019, 11:44 PM IST

ETV Bharat / bharat

లోక్​పాల్​ ఆహ్వానం.. ఖర్గే తిరస్కారం

లోక్​పాల్​ చట్టానికి తాను ప్రతిపాదించిన సవరణలపై కేంద్రం స్పందిచకపోవడం వల్ల మరోసారి సమావేశ ఆహ్వానాన్ని తిరస్కరించారు కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు మల్లికార్జున ఖర్గే.

మల్లికార్జున ఖర్గే

లోక్​పాల్​ కమిటీ ఆహ్వానాన్ని మరోసారి తిరస్కరించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత మల్లికార్జున ఖర్గే. సమావేశానికి కచ్చితంగా హాజరు కావాలనే ప్రత్యేక నిబంధనేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు.

గతేడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఏడుసార్లు ఆహ్వానాన్ని తిరస్కరించారు ఖర్గే. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్​ తరఫునలోక్​పాల్​ చట్టానికి తాను ప్రతిపాదించిన సవరణలపై కేంద్రం​ ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్లే సమావేశ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రధాని మోదీకి లేఖ రాశారు ఖర్గే.

లోక్​పాల్​ చట్టంలోని సెక్షన్​ 4, 2013 ప్రకారం... సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలనే ప్రత్యేక నిబంధనేమీ ఏమీ లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు.

ఐదు సంవత్సరాలుగా లోక్​పాల్​ను నియమించకపోవటానికి సమావేశాలకు తన గైర్హాజరే కారణమని భాజపా మంత్రులు ప్రచారం చేస్తున్నారని ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తప్పనిసరిగా హాజరు నిబంధనను ఆయన ప్రస్తావించారు. అయితే సుప్రీం ఒత్తిడితో చివరికి లోక్​పాల్​ సభ్యుల నియామకానికి కేంద్రం చర్యలు చేపట్టిందని వ్యాఖ్యానించారు ఖర్గే.

ప్రతిపక్షాల పాత్ర లేకుండా లోక్​పాల్​ నియామకాల విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తే అది అక్రమమని ఖర్గే హెచ్చరించారు. ప్రతిపక్షం ఆమోదం లేకుండా జరిగే నియమాకాలు చెల్లవని ఆయన అన్నారు.

ABOUT THE AUTHOR

...view details