తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కీబోర్డు ఎక్కువగా వాడితే అంతే సంగతులు!

మీరు కీబోర్డు ఎక్కువ ఉపయోగిస్తున్నారా? అయితే ఆరోగ్యానికి ఇబ్బందే అంటున్నారు వైద్యులు. ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చెబుతున్నారు దిల్లీ ఎయిమ్స్​ డాక్టర్లు.

కీబోర్డు ఎక్కువగా వాడితే అంతే సంగతులు!

By

Published : Apr 7, 2019, 12:46 PM IST

కీబోర్డు ఎక్కువగా వాడితే అంతే సంగతులు!

ఇప్పడు పుస్తకంలో రాసుకునే రోజులు పోయాయి. కంప్యూటర్​, ల్యాప్​టాప్​, ట్యాబ్స్​ అంటూ ఎన్నో అత్యాధునిక పరికరాలు వచ్చాయి. ఈ తరం వారు పెన్ను కన్నా కీబోర్డులే ఎక్కువ ఉపయోగిస్తున్నారు. కానీ దీర్ఘకాలంలో ఇది ఎంతో ప్రమాదకరమని పరిశోధనల్లో తేలింది.

పాఠశాలలు, ఆఫీసులు, రైల్వే కౌంటర్లు... ఇప్పుడు ఎటు చూసినా కంప్యూటర్​లే దర్శనమిస్తున్నాయి. రోజంతా కీబోర్డుతోనే పని. కానీ వారంలో 10గంటలకన్నా ఎక్కువ సేపు కీబోర్డు ఉపయోగిస్తే పెద్ద సమస్యే వస్తుందని దిల్లీ ఎయిమ్స్​ వైద్యులు హెచ్చరిస్తున్నారు. మెడ, చేతుల నోప్పి వస్తాయంటున్నారు. దీర్ఘకాలంలో ఇది ఎంతో ప్రభావం చూపుతుందని తెలిపారు.

ఎముకలు దెబ్బతినడం వల్లే ఈ సమస్య ఏర్పడుతుందని ఎయిమ్స్ ఆసుపత్రి​ ఎముకల విభాగ అసిస్టెంట్​ ప్రోఫెసర్​ వైద్యుడు వివేక్​ శంకర్​ అన్నారు. పని చేసే విధానాల్లో మార్పులు రావడమే ఇందుకు కారణమన్నారు.

"ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఈ సమస్య వేగంగా వ్యాపిస్తోందని ఎన్నో నివేదికలు తెలిపాయి. పని చేసే విధానంలో మార్పులు రావడమే ఇందుకు కారణం. కంప్యూటర్​, ల్యాప్​టాప్​ ఎక్కువ ఉపయోగిస్తున్నాం. వ్యాయామం బాగా చేయాలి. ప్రతి అరగంట పాటు పని నుంచి విశ్రాంతి తీసుకోవాలి. మోచేయి, మణికట్టు వ్యాయామం చేయాలి. ఈ సమస్యతో బాధపడుతున్న వారు పని నుంచి కనీసం 15 రోజులు విశ్రాంతి తీసుకోవాలి. మణికట్టును వాడకూడదు. చన్నీటితో మర్దన చేసుకోవాలి. వైద్యుడిని సంప్రదించాలి."
--- వివేక్​ శంకర్​, దిల్లీ ఎయిమ్స్​ అసిస్టెంట్​ ప్రొఫెసర్

​జాగ్రత్త వహించక పోతే ఎముకలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదముందని హెచ్చరించారు వివేక్​.

ABOUT THE AUTHOR

...view details