తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ వ్యాధుల నివారణలో కేరళకు ఐరాస గౌరవం

అసంక్రమణ వ్యాధుల నివారణలో కేరళ చేస్తున్న అవిరళ కృషికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. ఆరోగ్యం పట్ల ఆ రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను గుర్తించిన ఐరాస.. యూఎన్​ ఇంటర్ ఏజెన్సీ టాస్క్​ఫోర్స్​ అవార్డును ప్రకటించింది.

Kerala wins UN award on prevention, control of non-communicable diseases
అసంక్రమిత వ్యాధుల నివారణలో కేరళకు ఐరాస గౌరవం

By

Published : Sep 25, 2020, 8:14 AM IST

అంతర్జాతీయ వేదికపై కేరళకు అరుదైన గౌరవం దక్కింది. అసంక్రమిత వ్యాధులను అరికట్టడంలో సుస్థిర లక్ష్యాల కోసం ఆ రాష్ట్రం చేస్తున్న అద్భుత కృషికి ఐక్యరాజ్యసమితి గుర్తింపు లభించింది. అందులో భాగంగా ఏటా అందించే యూఎన్​ ఇంటర్ ఏజెన్సీ టాస్క్​ఫోర్స్​(యూఎన్​ఐఏటీఎఫ్​) అవార్డును ఈ ఏడాది మలయాళీ రాష్ట్రం దక్కించుకుంది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) డైరెక్టర్​ జనరల్​ టెడ్రోస్​ అధనోమ్​ ప్రకటించారు.

ఈ పురస్కారంపై హర్షం వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేకే శైలజ. జీవన విధానాన్ని ప్రభావితం చేసే వ్యాధుల పట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి అన్ని స్థాయిల ఆసుపత్రుల్లో సకల సౌకర్యాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అందువల్లే కరోనా కాలంలోనూ ఆ రాష్ట్రంలో మరణాల రేటు నియంత్రణలో ఉందని పేర్కొన్నారామె.

యూఎన్​ఓ అందించే ఈ వార్షిక పురస్కారం కేరళకు దక్కడం ఇదే తొలిసారి కాగా.. ప్రపంచ వ్యాప్తంగా ఏడోది.

ఇదీ చదవండి:బంపర్ ఆఫర్: ఓనం లాటరీలో రూ.12 కోట్లు

ABOUT THE AUTHOR

...view details