తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాహుల్​​ 'వయనాడ్' స్థానంలో​ పెరిగిన ఓటింగ్​ - రాహుల్​గాందీ

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీ పోటీ చేసిన కేరళలోని వయనాడ్​ లోక్​సభ స్థానంలో ఓటేసేందుకు ప్రజలు ఉత్సాహం చూపారు. 2014తో పోలిస్తే ఈ ఏడాది ఇక్కడ 3 శాతం అధిక పోలింగ్​ నమోదైంది.

వయనాడ్​లో రికార్డు స్థాయి పోలింగ్​

By

Published : Apr 24, 2019, 5:54 AM IST

Updated : Apr 24, 2019, 7:07 AM IST

వయనాడ్​లో రికార్ఢు స్థాయి పోలింగ్​

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​గాంధీ పోటీ చేసిన కేరళ వయనాడ్​లో ఈ ఏడాది రికార్డుస్థాయి పోలింగ్​ శాతం నమోదైంది. మంగళవారం జరిగిన మూడో విడత లోక్​సభ ఎన్నికల్లో కేరళలోని 20 పార్లమెంటు స్థానాలకు ఓటింగ్ జరిగింది. వయనాడ్​లో సాయంత్రం 6 గంటలకు వరకు రికార్డుస్థాయిలో 76.21 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

2014 (73.2 శాతం)తో పోలిస్తే ఈ ఓటింగ్ 3 శాతం అధికం. వయనాడ్​లో మొత్తం 13,57,819 ఓటర్లున్నారు.

వయనాడ్​ నుంచి రాహుల్​ పోటీ చేస్తున్నందునే రికార్డు స్థాయి పోలింగ్​ నమోదైందని లెఫ్ట్​ కార్యకర్తలు చెబుతున్నారు.

గతంతో పోలిస్తే ఈ ఏడాది అధికశాతం ఓటింగ్ నమోదైనందున రాహుల్​గాంధీ అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ఏఐసీసీ జనరల్​ సెక్రటరీ కేసీ వేణుగోపాల్​ ధీమా వ్యక్తం చేశారు. ​

"ప్రధాని నరేంద్రమోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్​షాల విభజన రాజకీయాల అజెండాకి కేరళ ప్రజలు గట్టి సమాధానమిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వయనాడ్​ను అమిత్​ షా పాకిస్థాన్​తో పోల్చారు. శబరిమల ఆలయంలోకి మహిళల అనుమతి విషయంలో భాజపా, ఎల్​డీఎఫ్​ చేసిన రాజకీయాలతో ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు."

- కేసీ వేణుగోపాల్​, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి

Last Updated : Apr 24, 2019, 7:07 AM IST

ABOUT THE AUTHOR

...view details