తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గజరాజుకు ప్రేమతో: 35 ఏళ్లుగా వార్తలు సేకరిస్తూ.. - Kerala teacher collecting elephant news clippings for 35 years

కేరళకు చెందిన ఓ ఉపాధ్యాయుడు తనదైన శైలిలో ఏనుగుల పట్ల ప్రేమను చాటుకుంటున్నారు. దాదాపు 35 ఏళ్లుగా ఏనుగు వార్తా కథనాలను సేకరిస్తున్నారు. వాటి ద్వారా వేలాది మంది విద్యార్థులకు గజరాజులు ఎదర్కొంటున్న హింసను వివరిస్తున్నారు. ఏనుగుల సంరక్షణకు బాటలు వేస్తున్నారు.

kerala-teacher-collecting-elephant-news-clippings-for-35-years
35 ఏళ్లుగా ఏనుగు వార్తలు సేకరిస్తూ..

By

Published : Aug 14, 2020, 3:38 PM IST

'ఏనుగు ఏనుగు నల్లనా.. ఏనుగు కొమ్ములు తెల్లనా' అంటూ పరిచయమై బాల్యంలోనే మన మనసులు దోచుకున్నాయి గజరాజులు. ఏనుగును దేవుళ్లతో సమానంగా కొలిచే దేశం మనది. భారీ కాయంతో సున్నిత మనస్సుతో ఉంటుంది కాబట్టి 'మా ఫేవరెట్ జంతువు ఏనుగు' అని చెప్పడమే గానీ, ఆ అమాయక వదనాల వెనక ఎంతటి శోకం ఉందో ఎవ్వరూ పట్టించుకోరు. కానీ, కేరళకు చెందిన ఓ టీచర్ మాత్రం దాదాపు 35 ఏళ్లుగా ఏనుగుల కన్నీటి గాథలను సేకరిస్తున్నారు.

35 ఏళ్లుగా ఏనుగు వార్తలు సేకరిస్తూ..

ఏనుగు ఘోష వినిపిస్తూ..

కేరళ పతనంతిట్ట జిల్లాకు చెందిన ఎమ్ఎమ్ జోసెఫ్.. తైక్కవులోని ఓ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. జోసెఫ్ మంచి రచయిత, తోలు బొమ్మలు ఆడించే కళ కూడా తెలుసు. వీటన్నింటికంటే, జోసెఫ్​కు ఏనుగులంటే అమితమైన ప్రేమ. అందుకే, 35 ఏళ్లుగా ఏనుగుల వార్తలను సేకరిస్తున్నారు. ఏనుగులు ఎదుర్కొంటున్న సమస్యలను అందరికీ తెలియజేస్తున్నారు. దంతాలు కాజేసే మానవుల వల్ల అవి హింసకు గురవుతున్న తీరుపై అవగాహన కల్పిస్తున్నారు.

ఏటా ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవం జరుపుకుంటున్నాం. కానీ, ఏనుగుల సంరక్షణ కోసం ఏం చేస్తున్నాం? కానీ, జోసెఫ్ న్యూస్ పేపర్లు, మ్యాగజైన్​లలో ఏనుగుల సంరక్షణ ప్రాముఖ్యతను తెలిపేలా ఏ వార్త కనిపించినా.. వాటిని సేకరించి భద్రంగా దాచేస్తారు. అలా ఇప్పటివరకు దాదాపు 3 వేలకు పైగా కథనాలను సేకరించారు. అంతేనా... వాటిని అవి ప్రచురితమైన తేదీలతో సహా.. ఓ ఆల్బమ్ లో అతికించారు. ఈ ఆల్బమ్​ను కుదిరినప్పుడల్లా స్థానిక పాఠశాలలకు తీసుకెళ్లి విద్యార్థులకు ఏనుగు పాఠాలు బోధిస్తారు. ఇలా వినూత్న పద్ధతిలో ఏనుగుల పట్ల ప్రేమను చాటుకుంటున్నారు.

ఇదీ చదవండి: నీట మునిగిన దేశం.. నిండా మునగకూడదంటే?

ABOUT THE AUTHOR

...view details