వైద్యవిద్యా రంగంలో కీలక సంస్కరణలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం భారత వైద్య మండలి(ఐఎంఏ) స్థానంలో తీసుకొచ్చిన జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి. దేశ రాజధాని దిల్లీలోని చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెసిడెంట్ డాక్టర్లు సమ్మెకు దిగారు. ఎయిమ్స్, రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రుల్లో.. అత్యవసర సేవలు కూడా బహిష్కరించి ఆందోళన చేపట్టారు.
కేరళ త్రివేండ్రంలోని రాజ్‌భవన్ ముందు వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. వైద్య కమిషన్ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పోస్టర్లును కాల్చుతూ నిరసనలు చేశారు.