కేరళ ఇడుక్కి జిల్లాకు చెందిన సుబహాని హజా మోయినుద్దీన్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్లో చేరి, ఇరాక్‌లో ఉగ్రదాడులకు పాల్పడినట్లు అతడిపై నేరం రుజువైంది. ఈ మేరకు శిక్ష విధించినట్లు అధికారులు తెలిపారు. రూ. 2,10,000 జరిమానా కూడా విధించినట్లు వెల్లడించారు.
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదికి జీవితఖైదు - ISIS terrorist latest news
కేరళకు చెందిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదికి జీవితఖైదు విధించింది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు. 2015లో ఐఎస్ఐఎస్లో చేరి, ఇరాక్‌లో పలు ఉగ్రకార్యకలాపాలకు పాల్పడినట్లు నేరం రుజువైంది.
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదికి జీవితఖైదు
2015 ఏప్రిల్‌లో మోయినుద్దీన్ ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు అభియోగపత్రం దాఖలు చేసింది ఎన్ఐఏ. అదే ఏడాది ఏప్రిల్- సెప్టెంబరు నెలల మధ్య ఇరాక్‌లో పలు ఉగ్ర కార్యకలాపాలకు మోయినుద్దీన్ పాల్పడినట్లు పేర్కొంది. అనంతరం, 2016లో కేంద్ర భద్రతా బలగాలు, రాష్ట్ర పోలీసుల సాయంతో తమిళనాడులో మోయినుద్దీన్‌ను అరెస్టు చేసింది ఎన్ఐఏ.
ఇదీ చూడండి:ఎన్కౌంటర్ చేయొద్దంటూ ప్లకార్డుతో లొంగిపోయిన గ్యాంగ్‌స్టర్