కేరళలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. పనసపండు తల మీద పడి గాయాలపాలయ్యాడు ఓ ఆటో డ్రైవర్. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లగా.. అతడికి కరోనా సోకినట్టు వైద్యులు తెలిపారు. ఆ విషయం తెలుసుకున్న అతడు షాక్కు గురయ్యాడు.
జరిగిందేమిటంటే..?
కన్నూరులోని పరియారం వైద్య కళాశాల అధికారుల కథనం ప్రకారం.. కాసరగోడ్ జిల్లాలోని బేలూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ పనసపండును తెంపబోయాడు. వాటిలో ఒకటి అతని తలపై పడటం వల్ల గాయపడ్డాడు. కాళ్లు, చేతులకు కూడా బాగా దెబ్బలు తగిలాయి. ఆ వ్యక్తికి శస్త్రచికిత్స జరపాలని వైద్యులు నిర్ణయించారు. ప్రస్తుత వైద్య నిబంధనల ప్రకారం, ఇతర పరీక్షలతో పాటు ఆ వ్యక్తికి కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షలనూ చేశారు. వెలువడ్డ ఫలితాల్లో అతనికి కరోనా ఉన్నట్టు తేలింది.