సాంకేతికతపరంగా దూసుకుపోతున్న కేరళ.. తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది. దేశంలోనే తొలిసారిగా.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు హైటెక్ క్లాస్ రూమ్‌లుగా మారాయి. ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. ఈ ఘనత సాధించడం పట్ల ఎంతో గర్వంగా ఉందన్నారు.
క్లాస్‌రూమ్‌లను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్ది, హెటెక్ ఐటీ ల్యాబ్‌లను ఏర్పాటు చేసినట్టు తెలిపిన ముఖ్యమంత్రి.. ఈ అత్యాధునిక వ్యవస్థతో విద్యార్థులు లబ్ధిపొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా లాప్టాప్స్, ప్రొజెక్టర్స్, వెబ్‌క్యామ్స్, ప్రింటర్సతో సహా 3లక్షలకుపైగా డిజిటల్ పరికరాలను సమకూర్చినట్టు వెల్లడించారు విజయన్.
"ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతులను హైటెక్ క్లాస్‌రూమ్‌లుగా మలచిన తొలి రాష్ట్రం కేరళ. సమాజంలో ఉన్న అందరికీ విద్య అందించాలన్న దృఢ నిశ్చయంతో ఈ మిషన్ సాధ్యపడింది. ఈ విషయాన్ని ప్రకటించడానికి ఎంతో గర్వంగా ఉంది. రాష్ట్రంలోని విద్యార్థులు ముందడుగు వేసేందుకు ఈ అత్యాధునిక వ్యవస్థ ఉపయోగపడుతుంది."
--- పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం.. ఈ 'ఎడ్యుకేషన్ రెజువనేషన్' మిషన్‌ను కైట్(కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్) చేపట్టింది. కేరళ మౌలిక వసతుల పెట్టుబడి నిధుల బోర్డు(కేఐఐఎఫ్బీ) నిధులు సమకూర్చింది. ఫలితంగా ఇప్పటివరకు 42వేల క్లాస్‌రూమ్‌ల్లో(8-12 తరగతులు) ల్యాప్టాప్స్, ప్రొజెక్టర్స్, స్క్రీన్లను ఏర్పాటు చేశారు. మిగిలిన వాటిల్లో కనీసం ఒక్క స్మార్ట్ క్లాస్రూమ్ అయినా ఉండేటట్టు చూసుకోవాలని ఆదేశాలిచ్చారు.
ఇదీ చూడండి:-'ఆ కేరళ విద్యార్థినిని రాష్ట్ర అతిథిగా గౌరవిస్తాం'