ప్రాణాంతక కరోనా వైరస్ను రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది కేరళ ప్రభుత్వం. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శైలజ వెల్లడించారు. మహమ్మారిని నియంత్రించేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు.
చీఫ్ సెక్రటరీ టామ్ జోస్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర విపత్తు నిర్వాహక విభాగం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు శైలజ స్పష్టం చేశారు.