తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ వైద్యుడి చేతులు అద్భుతం చేశాయి..!

కేరళ పూరమ్​ ఉత్సవాల్లో వినిపించే వాద్యాల శబ్ధాన్ని పునఃసృష్టించాడు ఓ దంత వైద్యుడు. అచ్చం ఆ వేడుకల్లో పాల్గొన్న అనుభూతి కలిగేలా రూపొందించిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

Kerala dentist recreates pooram percussion
పూరమ్ ఉత్సవాల మ్యూజిక్​ను పునఃసృష్టి చేసిన వైద్యుడు

By

Published : May 4, 2020, 3:24 PM IST

కేరళలోని త్రిస్సూర్​లో ఏటా పూరమ్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వేల సంఖ్యలో ప్రజల మధ్య విభిన్న సంగీత వాద్యాలు వాయిస్తూ, డప్పు చప్పుళ్లతో(పూర​ మేళమ్​) ఘనంగా ఊరేగింపు నిర్వహిస్తారు. అయితే.. కరోనా మహమ్మారి కారణంగా గడిచిన 58 ఏళ్లలో తొలిసారి ఈ ఏడు పూరమ్​ ఉత్సవాలు నిరాడంబరంగా జరిగాయి. అదీ కొద్ది మంది ప్రజల నడుమ..!

కేవలం త్రిస్సూర్​ వాసులకే కాస్తోకూస్తో ఈ పుర మేళా అనుభూతి కలిగింది. ఈ నేపథ్యంలోనే వేడుకలను ప్రత్యక్షంగా తిలకించినట్లుగా ఉండే అనుభూతి అందరికీ కల్పించాలనుకున్నాడో దంత వైద్యుడు. అంతే తనలోని ప్రతిభను బయటకుతీశాడు. తన కళకు పదునుపెట్టి.. ఉత్సవాల్లో వినిపించే సంగీతాన్ని తిరిగి సృష్టించాడు. వాద్యాల శబ్ధాలను పునఃసృష్టించేందుకు తీవ్రంగా శ్రమించాడు డా.జిమిలి జార్జ్​. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

పూరమ్ ఉత్సవాల మ్యూజిక్​ను పునఃసృష్టి చేసిన వైద్యుడు

ఇంటివద్దే అన్నీ సమకూర్చుకొని​...

కరోనా లాక్​డౌన్​తో ఇంట్లోనే ఉంటున్న జార్జ్​కు.. సంగీతంతో ప్రయోగం చేసేందుకు కావాల్సినంత సమయం దొరికింది. ముందునుంచీ సంగీతప్రియుడైన ఏదైనా చేయాలని అనుకున్నదే తడవుగా పూరమ్​ ఉత్సవాల్లో వినిపించే మ్యూజిక్​ను.. అచ్చం అలాగే పునఃసృష్టి చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తన ఇంటినే వేదికగా చేసుకున్నాడు.

పూర మేళంలో చెందా, వలంతల, కుజాల్​, ఇలతలమ్​ వంటి వాద్యాలను ఉపయోగిస్తారు. అయితే.. అన్ని రకాల సంగీత పరికరాలు అందుబాటులో లేనందున.. ఇంట్లోనే అన్నీ సమకూర్చుకున్నాడు. పనస చెక్కతో చేసిన స్టూలును చెందాగా, వలంతల వలే బేస్​ ఎఫెక్ట్​గా స్పీకర్​ బాక్సు, కజుల్​ మాదిరిగా శబ్ధం వచ్చే ఆఫ్రికన్​ కాజూను వినియోగించాడు జార్జ్​. మేళానికి తప్పక అవసరమైన ఇలతలమ్​ను తన స్నేహితుడి దగ్గర తెచ్చుకున్నాడు. వీటికి తోడు.. తనలో మిమిక్రీ నైపుణ్యం ఎలాగూ ఉండనే ఉంది.

ఒక్కో వాద్యాన్ని వేర్వేరుగా వాయించిన అనంతరం.. వాటి వీడియో, ఆడియోలను మిక్స్​ చేశాడు​. పూర మేళమ్​లో వచ్చే శబ్ధాన్ని తిరిగి సృష్టించగలిగాడు. సౌండ్​ మిక్సింగ్​ సొంతంగా చేయగా.. జాయ్​ సెన్​ అనే వ్యక్తి వీడియో ఎడిటింగ్ చేశాడు.

తొలిసారేం కాదు..

డా. జమిల్​ జార్జ్​ ఇదొక్కటే కాదు ఇంతకు ముందు పలు మ్యూజిక్​ ఆల్బమ్స్​ చేశాడు. మలయాళం సినిమా అయ్యప్పనమ్​ కొశియమ్​లో నాంచియమ్మ పాడిన పాటను పునఃసృష్టి చేసే ప్రయత్నం చేశాడు.

ABOUT THE AUTHOR

...view details