మద్యం విక్రయంలో కేరళ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఆన్లైన్లో మద్యం అమ్మకాలు జరిగేలా 'బెవ్ క్యూ' అనే సరికొత్త యాప్‌ను అభివృద్ధి చేసింది. తాజాగా గూగుల్ నుంచి అనుమతి పొందిన ఈ యాప్.. త్వరలోనే గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల్లో ప్రభుత్వ బేవరేజెస్ కార్పొరేషన్(బెవ్కో) ద్వారా రాష్ట్రంలో ఆన్లైన్ అమ్మకాలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.
'బెవ్ క్యూ' యాప్‌తో ఇకపై ఇంటివద్దకే మద్యం! - latest liquor home delivery news
మద్యం ప్రియులకు కేరళ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఆన్లైన్లో మద్యం అమ్మకాలు జరిగేలా సరికొత్త 'బెవ్ క్యూ' యాప్‌ను తీసుకొచ్చింది. ఇటీవలే గూగుల్ నుంచి ఆమోదం కూడా పొందినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు.
'బెవ్ క్యూ' యాప్‌తో ఇకపై ఇంటివద్దకే మద్యం!
గూగుల్ నుంచి ఆమోదం పొందడంలో ఆలస్యం కావడం వల్ల.. గతవారమే ప్రారంభం కావాల్సిన మద్యం అమ్మకాలు వాయిదా పడ్డాయి. అసలు ఎలాంటి అనుభవం లేని సంస్థకు యాప్‌ను అభివృద్ధి చేసే ప్రాజెక్టును ప్రభుత్వం అప్పగించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎట్టకేలకు మందుబాబులకు ఉపశమనం కలిగించేందుకు 'బెవ్ క్యూ' యాప్ సిద్ధమైంది.
ఇదీ చూడండి:ఈ నెల 14 నుంచి మద్యం 'హోమ్ డెలివరీ'!