భాజపా నేత, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తనపై అభ్యంతరకర ట్వీట్లు చేశారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గంభీర్ తనకు వ్యక్తిగతంగా, రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపించారు.
తన గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన గంభీర్.. ఈ నోటీసు అందిన 24 గంటల్లోనే తన ట్విట్టర్ ఖాతాలో నిజమైన, సరైన వాస్తవాలను వెల్లడించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
గౌతమ్ గంభీర్ తూర్పు దిల్లీ లోక్‌సభ స్థానం నుంచి భాజపా తరపున పోటీచేస్తున్నారు. ఆయనపై ఆమ్ ఆద్మీ పార్టీ తరపున అతిశి మార్లేనా పోటీ చేస్తున్నారు. భాజపాపై, గంభీర్ వ్యాఖ్యలపై అతిశి పరువునష్టం దావా వేశారు. ప్రతిగా గంభీర్ ట్విట్టర్లో మరోసారి కేజ్రీవాల్‌ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు.