తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హరియాణా మట్టిలో ఏదో ఉంది : కేజ్రీవాల్​ - HARYANA

వారణాసి లోక్​సభ స్థానంలో హరియాణాకు చెందిన మాజీ జవాను పోటీపై దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ స్పందించారు. దేశ ప్రజల తరఫున ఎస్పీ-బీఎస్పీ అభ్యర్థికి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ప్రకటించారు.

హరియాణా మట్టిలో ఏదో ఉంది : కేజ్రీవాల్​

By

Published : May 1, 2019, 6:21 AM IST

Updated : May 1, 2019, 8:58 AM IST

హరియాణా మట్టిలో ఏదో ఉంది : కేజ్రీవాల్​

ఉత్తర్​ప్రదేశ్​లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. లోక్​సభ ఎన్నికల్లో భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్​ఎఫ్) మాజీ జవాన్​​ 'తేజ్​ బహదూర్​ యాదవ్​'ను బహుజన్​ సమాజ్​ పార్టీ (బీఎస్పీ), సమాజ్​వాదీ​ పార్టీ, రాష్ట్రీయ లోక్​దళ్​(ఆర్​ఎల్​డీ) పార్టీల కూటమి తమ వారణాసి అభ్యర్థిగా ప్రకటించాయి. ఈ విషయంపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​ స్పందించారు. హరియాణా గడ్డ నుంచి వచ్చిన వ్యక్తి మోదీపై పోటీ చేయడం సంతోషంగా ఉందని ట్వీట్​ చేశారు.

" హరియాణా మట్టిలో ఏదో ఉంది. గత ఎన్నికల్లో హరియాణా నుంచి వచ్చిన ఓ వ్యక్తి (అరవింద్​ కేజ్రీవాల్​) మోదీకి సవాలు విసిరారు. ఇప్పుడూ హరియాణాకు చెందిన ఓ జవాను వారణాసిలో మోదీకి ఎదురు నిలబడ్డారు. దేశం మొత్తం తరఫున ఎస్పీ-బీఎస్పీ అభ్యర్థికి శుభాకాంక్షలు."
- అరవింద్​ కేజ్రీవాల్​, దిల్లీ ముఖ్యమంత్రి

హరియాణాలో పుట్టి పెరిగిన కేజ్రీవాల్​.... 2014 సాధారణ ఎన్నికల్లో మోదీకి సవాల్​ విసురుతూ వారణాసి లోక్​సభ స్థానానికి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 3 లక్షల మెజారిటీతో మోదీ గెలుపొందారు.

మే 19న ఆఖరి విడత పోలింగ్​లో భాగంగా వారణాసి లోక్​సభ స్థానానికి ఎన్నికలు​ జరగనున్నాయి.

భారత సరిహద్దు భద్రతా దళంలో విధులు నిర్వర్తించిన యాదవ్​ను​... నాసిరకం భోజనంపై ఫిర్యాదు చేసినందుకు 2017లో విధుల నుంచి తప్పించారు.

Last Updated : May 1, 2019, 8:58 AM IST

ABOUT THE AUTHOR

...view details