తమ బంధువులతో మాట్లాడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడి ప్రజలు. తమ వారితో సమాచారం పంచుకునేందుకు తపాలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నట్లు చెబుతున్నారు. కానీ వారి లేఖలు బంధువులకు చేరటం లేదని పేర్కొంటున్నారు.
స్థానికులకే కాదు తపాలా సిబ్బందికీ ఇబ్బందులు తప్పడం లేదు. కశ్మీర్లోని చాలా ప్రాంతాల్లో మూడు రోజుల క్రితం తపాలా కార్యాలయాలు తెరుచుకున్నాయి. ఉద్యోగులు విధులకు హాజరవుతున్నా... ఆంక్షలతో సరైన రవాణా లేకపోవటం వల్ల ఉత్తరాలను చేరవేయలేకపోతున్నారు.