కశ్మీర్ అంశంలో ఎండీఎంకే అధినేత వైగో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ వందో స్వాతంత్ర్య దినోత్సవం వరకు దేశంలో కశ్మీర్ భాగం కాకుండా పోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, డీఎంకే వ్యవస్థాపకులు అన్నాదురై 110వ జయంత్యుత్సవాల ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన ఆయన ఈ విధంగా స్పందించారు.
"భారత్ 100వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకొనే సమయానికి కశ్మీర్ మన దేశంలో భాగంగా ఉండదు. కశ్మీర్‌ను భాజపా బురదలోకి నెట్టేసింది. కశ్మీర్‌పై నా అభిప్రాయాన్ని ముందుగానే చెప్పాను. కశ్మీర్ అంశంలో కాంగ్రెస్ 30 శాతం, భాజపాది 70 శాతం తప్పు ఉంది."