కచేరీలలో విరివిగా వాడే సాధనం నాదస్వరం. పురాతన కాలం నాటి నుంచి అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ వాయిద్య పరికరాన్ని చెక్కతో తయారుచేస్తారు. అయితే.. అందుకు భిన్నంగా రాతితో నాదస్వరాన్ని చేసి అబ్బుర పరిచాడు తమిళనాడు మధురై వాసి కార్తిక్.
శిలను నాదస్వరంలా మార్చిన యువకుడు
సంగీత వాయిద్య పరికరాలలో నాదస్వరం ఒకటి. సాధారణంగా చెక్కతో తయారయ్యే ఈ పరికరాన్ని.. శిలతో తయారుచేశాడు తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థి. తాను తయారుచేసిన వాయిద్యం కూడా మామూలు నాదస్వరం లాగే పనిచేస్తుందని చెబుతున్నాడు.
శిలను నాదస్వరంలా మార్చిన కార్తిక్!
మామూలు నాదస్వరానికి ఏమాత్రం తీసిపోకుండా.. తాను చేసిన వాయిద్య పరికరం కూడా అచ్చం అలాగే పనిచేస్తుందని తెలిపాడు 12వ తరగతి విద్యార్థి కార్తిక్. తెలుగు ప్రజలు సన్నాయిగా పిలిచే ఈ పరికరాన్ని తయారుచేసేందుకు చాలా కష్టపడ్డానని అతడు చెప్పుకొచ్చాడు.
ఇదీ చదవండి:నయాగరా జలపాతంలో మువ్వన్నెల జెండా ఉప్పొంగగా!
Last Updated : Aug 16, 2020, 4:14 PM IST