తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎన్​ఈపీ అమలు చేసే తొలి రాష్ట్రంగా కర్ణాటక' - కర్ణాటక

దేశంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా కర్ణాటక అవతరించనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డాక్టర్​ సీఎన్​​ అశ్వత్​ నారాయణ్​ తెలిపారు. అవసరమైన అన్ని రకాల పరిపాలన సంస్కరణలు, చట్ట సవరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

NEP
'ఎన్​ఈపీ అమలు చేసే తొలి రాష్ట్రంగా కర్ణాటక'

By

Published : Aug 24, 2020, 5:32 PM IST

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలు చేసే తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలువనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఉన్నతవిద్యాశాఖ మంత్రి డాక్టర్​ సీఎన్​ అశ్వత్​ నారాయణ్ వెల్లడించారు. జాతీయ విద్యావిధానంలోని హైలైట్స్​, అమలుపై ఐదురోజుల పాటు నిర్వహించే ఆన్​లైన్​ వర్క్​షాప్​ ప్రారంభోత్సవం సందర్భంగా ఆ మేరకు ప్రకటించారు మంత్రి. ఈ వర్క్​షాప్​ను బెంగళూరు విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది.

" జాతీయ విద్యావిధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన చట్టాల సవరణ, పరిపాలన సంస్కరణలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేస్తోంది. ఎన్​ఈపీని అమలు చేసే తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలుస్తుంది."

- అశ్వత్​ నారాయణ్​, ఉపముఖ్యమంత్రి, ఉన్నత విద్యాశాఖ మంత్రి.

నిర్దిష్ట లక్ష్యాలు, స్పష్టమైన అజెండాతో ఎన్​ఈపీ అమలుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు మంత్రి. ఎన్​ఈపీ ముసాయిదా అందగానే ఉన్నతస్థాయి కార్యనిర్వాహక దళం ఏర్పాటు చేశామని, ఇప్పటికే కమిటీ సలహాలు, సూచనలు అందించిందని వెల్లడించారు. తుది మార్గదర్శకాలు రాగానే నూతన విద్యావిధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు అశ్వత్​ నారాయణ్​.

ఇదీ చూడండి: 21వ శతాబ్దం కోసం సరికొత్త జాతీయ విద్యా విధానం

ABOUT THE AUTHOR

...view details