తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపాకు ఓటేసిన జేడీఎస్​ కార్యకర్తలు..! - భాజపా

కర్ణాటకలో అధికారంలో ఉన్న జేడీఎస్​-కాంగ్రెస్​ కూటమి  లోక్​సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయి. అయితే మైసూరు లోక్​సభ స్థానంలో కూటమి తరఫున బరిలో నిల్చున్న కాంగ్రెస్​ అభ్యర్థికి కాకుండా జేడీఎస్​ కార్యకర్తలు భాజపాకు ఓటు వేశారని రాష్ట్రమంత్రి వ్యాఖ్యానించడం కూటమి నేతల్ని కలవరపెడుతోంది.

భాజపాకు ఓటేసిన జేడీఎస్​ కార్యకర్తలు..!

By

Published : May 3, 2019, 7:32 AM IST

Updated : May 3, 2019, 10:46 AM IST

భాజపాకు ఓటేసిన జేడీఎస్​ కార్యకర్తలు...!

కన్నడ నాట మరోసారి రాజకీయ దుమారం రేగింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​, భాజపా హోరాహోరిగా పోరాడాయి.హంగ్​ ఏర్పడటం వల్ల 38 సీట్లు దక్కించుకున్న జేడీఎస్.. కింగ్​ మేకర్​గా మారి హస్తం పార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు లోక్​సభ ఎన్నికల్లో జేడీఎస్​-కాంగ్రెస్​ కలిసి పోటీ చేస్తున్నాయి. భాజపాను నిలువరించడానికే ఈ నిర్ణయానికి వచ్చాయి.

ఎన్నో ఏళ్ల నుంచి ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ ఇరు పార్టీల అగ్రనాయకులు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కలిసి వచ్చారు. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం పార్టీ కార్యకర్తలు కలుస్తారో లేదో అనే అనుమానం ఉంది. తాజాగా రాష్ట్ర మంత్రి జి.టి. దేవెగౌడ చేసిన వ్యాఖ్యలు కూటమిని కలవరపెడుతున్నాయి. మైసూరు లోక్​సభ నియోజకవర్గంలో జేడీఎస్​ నాయకులు భాజపాకు ఓటు వేసినట్లు సదరు మంత్రి పేర్కొన్నారు.

ఈ విషయంపై మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత సిద్దరామయ్య స్పందించారు.

"మంత్రి జీటీ దేవెగౌడ వ్యాఖ్యలు నన్ను ఆశ్చర్యపరిచాయి. ఆయన మాటలు నిజం కాకపోయి ఉండవచ్చని భావిస్తున్నాను. మే 23న ఫలితాలు వచ్చినప్పుడు అసలు విషయం తెలుస్తుంది."
-సిద్దరామయ్య, కాంగ్రెస్​ సీనియర్​ నేత

జీటీ దేవెగౌడ వ్యాఖ్యలపై కాంగ్రెస్​ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో కూటమి ప్రయోజనాలు దెబ్బతింటాయని బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

ఎవరీ దేవెగౌడ?

గత సంవత్సరం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మైసూర్​ చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత సిద్దరామయ్యపై జేడీఎస్​ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు జీటీ దేవెగౌడ. ప్రస్తుతం కుమారస్వామి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

మైసూర్ పట్టుపట్టిన జేడీఎస్​...

జేడీఎస్​ కార్యకర్తల్లో ఎక్కువ శాతం మంది మైసూర్​ లోక్​సభ స్థానాన్ని కాంగ్రెస్​కు కేటాయించడాన్ని వ్యతిరేకించారు. జేడీఎస్​ పార్టీ దళపతి హెచ్​డీ దేవెగౌడ ఈ స్థానం నుంచి పోటీ చేయాలని వారు కోరారు.

ఎట్టకేలకు కాంగ్రెస్​కు...

కూటమి తరఫున పోటీ చేసేందుకు కాంగ్రెస్​ ఈ స్థానాన్ని దక్కించుకుంది. పార్టీ సీనియర్​ నేత సిద్దరామయ్య సొంత నియోజకవర్గం కావడం వల్ల జేడీఎస్​కు సీటు వదులుకోవడానికి ఆయన ఒప్పుకోలేదు. కాంగ్రెస్​ నేత సి.హెచ్. విజయశంకర్ కూటమి తరఫున​ మైసూరు లోక్​సభ అభ్యర్థిగా బరిలో నిలిచారు.

మోదీ నినాదాలు..!

కాంగ్రెస్​ అభ్యర్థికి మద్దతిచ్చేందుకు నిర్వహించిన జేడీఎస్​ కార్యకర్తల సమావేశంలో కొంతమంది మోదీకి అనుకూలంగా నినాదాలు చేయడం చర్చనీయాంశమైంది.
విజయశంకర్​ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు జీటీ దేవెగౌడ ముందు దూరంగా ఉన్నారు. అయితే ఎట్టకేలకు కూటమి నాయకులు పలుమార్లు కోరగా ప్రచార సభకు హజరయ్యారు. సిద్దరామయ్యతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. భాజపా తరఫున సిట్టింగ్​ ఎంపీ ప్రతాప్​ సింహా బరిలో ఉన్నారు.

ఇదీ చూడండి: ఒడిశాలో నేడు విమానాలు బంద్​, 220 రైళ్ల రద్దు

Last Updated : May 3, 2019, 10:46 AM IST

ABOUT THE AUTHOR

...view details