తెలంగాణ

telangana

ETV Bharat / bharat

110 మంది కుటుంబసభ్యులు ఒకేసారి ఓటు వేస్తే... - karnataka: joint family of 110 members using vote at single polling station

కర్ణాటక ఉపఎన్నికల్లో అరుదైన దృశ్యం కనిపించింది. చిక్​బళ్లాపుర్​లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన 110మంది ఓటు వేశారు.

knkfamily
పోలింగ్ బూత్ అంతా ఒకే కుటుంబం!

By

Published : Dec 5, 2019, 11:50 AM IST

కర్ణాటక ఉపఎన్నికల్లో ఒక కుటుంబం అందరినీ ఆశ్చర్యపరిచింది. చిక్​బళ్లాపుర్ పోలింగ్ కేంద్రంలో 'సెంచరీ ఓట్ల'తో రికార్డు సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన మొత్తం 110 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.

ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ తమ కుటుంబంలో సందడి నెలకొంటుందన్నారు ఉమ్మడికుటుంబ సభ్యుడు లక్ష్మీరామ్. అందరూ ఒకే కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పోలింగ్​కు గైర్హాజరు కామని, దీని ద్వారా ఓటు ప్రాధాన్యాన్ని చాటుతున్నామని తెలిపారు.

పోలింగ్ బూత్ అంతా ఒకే కుటుంబం!

ఇదీ చూడండి: కర్ణాటక: కొనసాగుతున్న పోలింగ్- బారులు తీరిన ఓటర్లు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details