తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకలో 10వేలు దాటిన కరోనా మరణాలు - West Bengal Corona updates

దేశంలో కొవిడ్​ విలయతాండవం కొనసాగుతోంది. ఇప్పటివరకు 71.33 లక్షల మంది వైరస్​ బారినపడ్డారు. వారిలో 1.09 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా 61.6 లక్షలమంది వైరస్​ను జయించగా.. 8లక్షల మందికిపైగా యాక్టివ్​ కేసులున్నాయి. అటు కర్ణాటకలో మరణాల సంఖ్య 10వేల మార్కును దాటింది.

Karnataka death cases 10,000 mark with 70 new fatalities today
కర్ణాటకలో 10వేలు దాటిన కరోనా మరణాలు

By

Published : Oct 12, 2020, 8:31 PM IST

Updated : Oct 12, 2020, 8:56 PM IST

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాల్లో వైరస్​ వ్యాప్తి అధికంగా ఉంది. కర్ణాటకలో మరో 7,606 మందికి మహమ్మారి సోకింది. ఫలితంగా బాధితుల సంఖ్య 7,17,915కు చేరింది. మరో 70 మరణాలతో.. మొత్తం మృతుల సంఖ్య 10,036కు ఎగబాకింది.

  • మహారాష్ట్రలో వైరస్​ వ్యాప్తి తగ్గినట్టే కనిపిస్తోంది. కొత్తగా 7,089 కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా బాధితుల సంఖ్య 15,35,315కు చేరింది. కరోనాతో మరో 165మంది చనిపోగా.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 40,514కు పెరిగింది.
  • కేరళలో ఒక్కరోజులో 5,930 కరోనా కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 2,93,132కు చేరింది. ఇప్పటివరకు అక్కడ 1,025 మంది కొవిడ్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
  • తమిళనాడులో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో కొత్తగా 4,879 మంది కొవిడ్​ బారినపడ్డారు. బాధితుల సంఖ్య 6,61,264కు చేరింది. మరో 62 మరణాలతో.. చనిపోయిన వారి సంఖ్య 10,314కు ఎగబాకింది.
  • దిల్లీలో సోమవారం ఒక్కరోజే 1,849 కరోనా కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య 3,11,188కి చేరింది. వైరస్​ సోకిన వారిలో మరో 40 మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 5,809కి పెరిగింది.
  • పశ్చిమ్​బంగాలో కొత్తగా 3,583 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. మొత్తం కేసుల సంఖ్య 3లక్షలకు చేరువైంది. ఇప్పటివరకు అక్కడ 5,862 మరణాలు నమోదయ్యాయి.
  • రాజస్థాన్​లో మరో 2,132 వైరస్​ కేసులు గుర్తించారు అధికారులు. బాధితుల సంఖ్య 1,61,184కు పెరిగింది. ఇప్పటివరకు అక్కడ 1,665 మంది మహమ్మారికి బలయ్యారు.
Last Updated : Oct 12, 2020, 8:56 PM IST

ABOUT THE AUTHOR

...view details