కర్ణాటక అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాల అంశంపై నేడు సుప్రీం కోర్టు విచారణ చేయనుంది. తమ రాజీనామాల ఆమోదంపై స్పీకర్ ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ బుధవారం వ్యాజ్యం దాఖలు చేశారు 10 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధా బోస్ ధర్మాసనం ఈ వ్యాజ్యంపై వాదనలు విననుంది
ఇదీ నేపథ్యం...
కర్ణాటక సంకీర్ణ సర్కారుపై అసంతృప్తితో మొత్తం 14 మంది అధికార పక్ష ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. ఇందులో 9 మంది రాజీనామాలు స్పీకర్ ఫార్మాట్లో లేవని సభాపతి తిరస్కరించారు. అయితే స్పీకర్ ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ 10 మంది రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంను ఆశ్రయించారు. పిటిషన్ స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టనుంది.
ఇదీ చూడండి: కశ్మీర్‌పై ఆల్‌ఖైదా నాయకుడి తొలి వీడియో