కర్ణాటక రాజకీయ సంక్షోభంపై రాజ్యసభలో ఇవాళ కూడా దుమారం రేగింది. విపక్ష కాంగ్రెస్ సభ్యులు కర్ణాటక పరిణామాలపై చర్చకు పట్టుబట్టారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సభలో చెలరేగిన గందరగోళంతో మూడుసార్లు వాయిదా పడింది.
కర్ణాటక అంశమై నిబంధన 267 ప్రకారం మిగతా అంశాలను నిలిపివేసి చర్చకు అనుమతించాలని విపక్ష సభ్యుడు కపిల్ సిబల్ చేసిన అభ్యర్థనను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. అనంతరం కాంగ్రెస్ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లారు. గందరగోళ పరిస్థితుల కారణంగా సభ రెండు సార్లు వాయిదా పడింది.