తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఎంకు ట్రాఫిక్​ చలానా- 4 నెలలుగా పెండింగ్ - ట్రాఫిక్ నిబంధనలు

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి నాలుగు నెలల క్రితం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించారు. పోలీసులు జరిమానా విధించినా ఇప్పటి వరకు చెల్లించకపోవడం గమనార్హం.

సీఎంకు ట్రాఫిక్​ చలానా- 4 నెలలుగా పెండింగ్

By

Published : Jun 29, 2019, 4:32 PM IST

ట్రాఫిక్​ నిబంధనలను ఉల్లంఘించి... కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విమర్శలపాలయ్యారు. నాలుగు నెలల క్రితం జరిగిన ఈ ఘటనలో ట్రాఫిక్ పోలీసులు సీఎంకు జరిమానా విధించారు. అయినా ఇప్పటి వరకు ఆయన ఫైన్​ చెల్లించలేదు.

సీఎం కుమారస్వామి ప్రభుత్వ కారుకు బదులుగా తన సొంత రేంజ్​ రోవర్​ను ఉపయోగిస్తున్నారు. ఫిబ్రవరి 10న బెంగళూరు సదాశివనగర్​ ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న సమయంలో కారు డ్రైవర్​ సెల్​ఫోన్ మాట్లాడుతూ బండి నడిపాడు. ఈ దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వాటి ఆధారంగా ట్రాఫిక్​ పోలీసులు ముఖ్యమంత్రి కుమారస్వామికి జరిమానా విధిస్తూ నోటీసు పంపారు.

సాధారణంగా నోటీసు పంపిన 7 రోజుల్లోగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 2 వారాల తరువాత పోలీసులు మరోసారి నోటీసు చేస్తారు. అప్పటికీ చెల్లించకపోతే కారును అపేసి జరిమానా వసూలు చేస్తారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ఇదీ చూడండి: రోగుల మధ్య అటెండర్ల 'టిక్​టాక్'​ చిందులు

ABOUT THE AUTHOR

...view details