తెలంగాణ

telangana

'కెమెరా' ఇల్లు.. చూడటానికి చాలవు రెండు కళ్లు

By

Published : Jul 15, 2020, 9:36 AM IST

కర్ణాటకకు చెందిన ఓ ఫోటోగ్రాఫర్ దంపతులు తమ అభిరుచికి అనుగుణంగా కెమెరా ఆకారంలో ఇంటిని నిర్మించుకున్నారు. అంతేకాకుండా కెమెరాపై ఉన్న అభిమానంతో తమ బిడ్డలకు... కెనాన్​, నికాన్, ఎప్సన్ అని గమ్మత్తుగా పేర్లు పెట్టుకున్నారు.

camera shaped house
కెమెరా ఆకారంలో ఫోటోగ్రాఫర్ దంపతుల కలల సౌధం

కర్ణాటక బెళగావికి చెందిన ఫోటోగ్రాఫర్ దంపతులు... తమ అభిరుచికి అనుగుణంగా, వినూత్నంగా కెమెరా ఆకారంలో ఇంటిని నిర్మించుకున్నారు. ఇది చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

కృపా హోంగల్, రవి హోంగల్ కర్ణాటక బెళగావికి చెందిన ఫోటోగ్రాఫర్లు. వీరు తమ వృత్తిపై ఉన్న అభిమానంతో.. తమ ముగ్గురు పిల్లలకు కెనాన్​, నికాన్​, ఎప్సన్ అనే కెమెరా పేర్లు పెట్టుకోవడం గమనార్హం.

కలల సౌధం

"ఈ కొత్త ఇంటి కోసం మా పాత ఇల్లు అమ్మేశాం. మరికొంత డబ్బు అప్పుగా తెచ్చాం. దీనితో మా కలల సౌధం సాకారమైంది. "

- రవి హోంగల్, ఫోటోగ్రాఫర్.​

.

కృపా, రవి దంపతులు నిర్మించిన కెమెరా ఆకారంలోని ఇళ్లు
కెమెరా ఆకారంలో ఇళ్లు

ఇదీ చూడండి:'అయోధ్య ఓ బౌద్ధ క్షేత్రం.. ఆలయ నిర్మాణం ఆపండి'

ABOUT THE AUTHOR

...view details