బిహార్‌లోని బెగూసరాయి లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి కన్నయ్యకుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. గర్పురా ప్రాంతంలోని కోరే గ్రామంలో కన్నయ్య రోడ్‌షో నిర్వహిస్తున్న సమయంలో... ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్థానికులు నల్లజెండాలు ప్రదర్శించారు. గతంలో కన్నయ్యకుమార్ జవాన్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆందోళనకు దిగారు.
కన్నయ్య కుమార్‌కు చేదు అనుభవం - bihar
బిహార్ బెగూసరాయి లోక్‌సభ సీపీఐ అభ్యర్థి, జేఎన్‌యూ మాజీ విద్యార్థి నేత కన్నయ్యకుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కోరే గ్రామస్థులు. నల్లజెండాలు ఊపుతూ నిరసన తెలిపారు.
కన్నయ్య కుమార్‌కు చేదు అనుభవం
ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘర్షణను అదుపు చేశారు. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్‌పై పోటీ చేస్తున్నారుకన్నయ్యకుమార్.
ఇదీ చూడండి: ఏదేమైనా జెట్‌ను మూతపడనివ్వం: జెట్ ఉద్యోగులు