రోడ్డుపై సినీ హీరో రౌడీయిజం- చితక్కొట్టిన జనం! కర్ణాటక కొడగులో ప్రముఖ సాండల్‌వుడ్ నటుడు హుచ్చా వెంకట్.. రోడ్డుపై బీభత్సం సృష్టించాడు. పార్క్ చేసి ఉన్న కారును ధ్వంసం చేశాడు.
పలు కన్నడ సినిమాల్లో హీరో, విలన్ వంటి భిన్న పాత్రల్లో కనిపించిన హుచ్చా వెంకట్..నాప్కోలులోని ఓ హోటల్‌కు వెళ్లాడు. సెలబ్రిటీ వచ్చాడని అక్కడున్న వారంతా ఆశ్చర్యంగా చూశారు. దిలీప్, అతడి స్నేహితులు కూడా అదే పనిచేశారు.
తనను విచిత్రంగా చూడడం నచ్చని వెంకట్... దిలీప్‌ను కొట్టేందుకు యత్నించాడు. ఫుట్‌పాత్ పక్కన పార్క్ చేసి ఉన్న మారుతీ 800 కారు దిలీప్దేనని తెలుసుకుని, రాళ్లతో కొట్టి అద్దాలు ధ్వంసం చేశాడు. రోడ్డుపై మోకాళ్లపై కూర్చుని కోపాన్ని ప్రదర్శించాడు. చిన్న విషయానికే ఇంత బీభత్సం సృష్టించిన వెంకట్ వింత ప్రవర్తనకు అక్కడున్నవారు షాక్ అయ్యారు. అంతా కలిసి అతడిని కొట్టారు.
పోలీసులు వెంకట్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: 370రద్దుతో ఒక్కటైన 'కశ్మీరీ-రాజస్థానీ' ప్రేమజంట