తెలంగాణ

telangana

ETV Bharat / bharat

75 ఏళ్లు పైబడిన వారికి భోజనం ఉచితం - కోజికోడ్​

నిరుపేద వృద్ధులకు ఆసరాగా నిలుస్తున్నాడు కేరళ కోజికోడ్​లోని ఓ హోటల్​ యజమాని. 75 ఏళ్లు పైబడిన వృద్ధులకు భోజనంతో పాటు తన హోటల్​లో లభించే ఇతర తినుబండారాలు ఉచితంగా అందిస్తున్నాడు. ఐదు సంవత్సరాలుగా సేవలందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు.

75 ఏళ్లు పైబడిన వారికి భోజనం ఉచితం

By

Published : Jul 31, 2019, 8:31 PM IST

75 ఏళ్లు పైబడిన వారికి భోజనం ఉచితం
75 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులకు ఉచిత భోజనం అందిస్తున్నాడు కేరళ కోజికోడ్​లోని ఓ హోటల్ యజమాని. జిల్లాలోని మారుమూల గ్రామమైన కుట్టియాడిలో చాలా తక్కువ దుకాణాలు ఉంటాయి. అందులో ఒకటి కండతిల్ అనే హోటల్​.

75ఏళ్లు పైబడిన వృద్ధులు ఈ హోటల్​కు వచ్చి ఏదైనా ఉచితంగా తినొచ్చు. ఎలాంటి పైకమూ చెల్లించాల్సిన అవరసం లేదు. ఎవరైనా ఇవ్వడానికి వచ్చినా హోటల్​ యజమాని బాబు వాటిని తిరస్కరిస్తారు. వయోవృద్ధులకు సేవలు చేయాలని సంకల్పించుకున్నానని చెప్తారు.

ఐదేళ్ల క్రితం గ్రామంలో హోటల్​ ప్రారంభించిన నాటి నుంచి వృద్ధులకు ఉచితంగా భోజనం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు బాబు.

ఇదీ చూడండి: వ్యర్థంలో నుంచి అద్భుతం-ఒడిశా విద్యార్థుల సృజన

ABOUT THE AUTHOR

...view details