మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కమల్నాథ్ తననుద్దేశించి 'కుక్క' అన్నారంటూ భాజపా ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా ఆరోపించారు. మధ్యప్రదేశ్లోని శాడోరాలో నిర్వహించిన ఉప ఎన్నికల ప్రచారసభలో సింథియా ఆ ఆరోపణలు చేశారు. ఈ విషయమై ఆయన పలు వ్యాఖ్యలు కూడా చేశారు.
" కమల్నాథ్ ఇక్కడకు వచ్చి నన్ను 'కుక్క' అని సంబోధించారు. అవును నేను అదే. ప్రజలే నా యజమానులు. కుక్క ఎప్పుడూ తన యజమానిని కాపాడుకుంటుంది" అని సింథియా వ్యాఖ్యానించారు.