తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్​'నాటక' భయం: కమల్​నాథ్ ముందు​ జాగ్రత్తలు

మధ్యప్రదేశ్​లో శాసనసభ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఆర్థిక బిల్లుల విషయంలో ఓటింగ్ పెట్టించాలని భాజపా యోచిస్తోంది. కాషాయ పార్టీ వ్యూహం ఫలిస్తే... అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుంది. అందువల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలనూ, బీఎస్పీ, ఎస్పీ, స్వతంత్రులను సమావేశాలకు కచ్చితంగా హాజరుకావాలని ముఖ్యమంత్రి కమల్​నాథ్ ఆదేశించారు.

By

Published : Jul 10, 2019, 6:01 AM IST

Updated : Jul 10, 2019, 7:23 AM IST

కర్ణాటకలా కాకుండా కమల్​నాథ్ ముందు​ జాగ్రత్తలు..!

కర్ణాటకలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం కారణంగా కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇలాంటి రాజకీయ సెగ తన ప్రభుత్వానికి తగలకుండా ముందే జాగ్రత్త పడుతున్నారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్​నాథ్​.

మధ్యప్రదేశ్​లో 7 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. స్వల్ప మెజారిటీతో ముఖ్యమంత్రి కమల్​నాథ్​ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. భాజపా నుంచి ఎలాంటి ప్రమాదం లేకుండా తన రాజకీయ చతురతతో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నారు.

బీజేపీ ఎత్తులు చిత్తు చేయాలి..

మధ్యప్రదేశ్​లో జులై 8 నుంచి శాసనసభ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. 19 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో...... ఆర్థిక బిల్లుల విషయంలో భాజపా డివిజన్​ తీసుకువచ్చి... ఓటింగ్ పెట్టమని డిమాండ్ చేయవచ్చు. ఇందులో నెగ్గుకురావాలంటే అసెంబ్లీలో ప్రభుత్వానికి సంఖ్యాబలం తప్పనిసరి. లేకపోతే ప్రభుత్వం కుప్పకూలుతుంది.

అందువల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అలాగే తనకు మద్దతుగా నిలిచిన బీఎస్పీ, ఎస్పీ, స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజధాని విడిచిపోకూడదని కమల్​నాథ్ స్పష్టం చేశారు.

బహుజన్ సమాజ్​ పార్టీ (బీఎస్పీ)... మంగళవారం కాంగ్రెస్ ప్రభుత్వానికి తన మద్దతును పునరుద్ధరించింది. ఇది కమల్​నాథ్​ ప్రభుత్వానికి శుభవార్త.

నీచ రాజకీయాలు..!

సంఖ్యాబలం లేకున్నా భాజపా నీచ రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేత, రాష్ట్ర ఆర్థికమంత్రి తరుణ్ భానోత్ ఆరోపించారు. అయితే భాజపా పాచికలు పారవన్నారు.

మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్, మిత్రపక్షాలు ఐక్యంగా ఉన్నందున భాజపా ఏమీ చేయలేదని భానోత్ అన్నారు.

భాజపా ఎత్తులు

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి భాజపా కూడా వ్యూహాలు రచిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో భాజపా ఎమ్మెల్యేలు అందరూ తప్పక హాజరు కావాలని ప్రతిపక్షనేత గోపాల్​ భార్గవ, భాజపా చీఫ్​ రాకేశ్​ సింగ్ సూచించారు.

లోక్​సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్​లోని 29 స్థానాల్లో భాజపా 28 సీట్లు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో భాజపా నేత గోపాల్​ భార్గవ మే నెలలో గవర్నర్​ ఆనందీబెన్​కు ఓ లేఖ రాశారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఫ్లోర్ టెస్ట్ చేయాలని కోరారు.

ఆర్థిక బిల్లుల విషయంలో డివిజన్​ పెట్టి ఓటింగ్ నిర్వహించాలని భాజపా భావిస్తోంది. అప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి శాసనసభలో ఎంత బలముందో తేలిపోతుందని గోపాల్ భార్గవ అభిప్రాయపడ్డారు. ఆర్థిక బిల్లులను నెగ్గించుకోవడంలో విఫలమైతే... ప్రభుత్వం కూలుతుందని గోపాల్ భార్గవ స్పష్టం చేశారు.

ఇదీ విషయం..

2018 మధ్యప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో 230 స్థానాలకుగాను కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకుంది. మేజిక్ నెంబర్ 116కు కేవలం 2 స్థానాల దూరంలో నిలిచిపోయింది. అయితే బీఎస్పీ నుంచి ఇద్దరు, సమాజ్​వాదీ పార్టీ (ఎస్పీ) నుంచి ఒకరు, నలుగురు స్వతంత్రులు.... కమల్​నాథ్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు.

109 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న భాజపా... 15 ఏళ్ల తరువాత మధ్యప్రదేశ్​లో అధికారాన్ని కోల్పోయింది.

ఇదీ చూడండి: భారత్​పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ గుస్సా

Last Updated : Jul 10, 2019, 7:23 AM IST

ABOUT THE AUTHOR

...view details